ఆల్ టైమ్ రికార్డ్‌గా బంగారం ధర.. కొనాలంటే వణకాల్సిందే! వీడియో

Updated on: Sep 12, 2025 | 2:10 PM

బంగారం కొనాలనుకునే వారికి షాక్. బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.

సెప్టెంబర్ 11, గురువారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,10,520 రూపాయిలు ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర రూ. 1,01,310 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,39,900 రూపాయలుగా ఉంది.ఢిల్లీలో 24 కేరట్ల బంగార ధర 1,10,660 రూపాయలు ఉండగా, 22 కేరట్ల ధర 1,01,460 రూపాయలుగా ఉంది. ముంబైలో 24 కేరట్ల బంగార ధర 1,10,670, 22 కేరట్ల ధర రూ.1,01,460 గా ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,10,520 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,310 గా ఉంది. బెంగుళూరులో 24 కేరట్ల బంగారం ధర రూ.1,10,520 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,310 గా ఉంది. ఉంది. కోల్‌కతాలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,10,520 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,310 గా ఉంది. ఉంది.ముఖ్యంగా గడచిన రెండు వారాలుగా గమనించినట్లయితే బంగారం ధర ప్రతిరోజు వెయ్యి రూపాయలు చొప్పున పెరుగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే బంగారం ధర భారీగా పెరగడానికి ప్రధాన కారణం డాలర్ విలువ పతనం అవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

తురకపాలెం బాధితుల్లో మెలియాయిడోసిస్‌ లక్షణాలు గుర్తింపు వీడియో

నర్సరీలో వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూసిన కూలీలకు షాక్ వీడియో

బస్సులో ఫోన్‌ పోగొట్టుకున్నారా.. జాగ్రత్త వీడియో

అలవాటుగా ఇంటి సీలింగ్‌వైపు చూసి వణికిపోయిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?వీడియో