గుడ్‌ న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే ??

Updated on: Oct 27, 2025 | 8:17 PM

గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటుంతూ సామాన్యుడికి చుక్కలు చూపించిన బంగారం ధర ఇప్పుడు నెమ్మదిగా దిగివస్తోంది. బంగారం దీపావళికి ముందు భారీగా పెరిగిపోయిన పసిడి దీపావళినుంచి తగ్గుముఖం పట్టింది. సామాన్యులకు తిరిగి బంగారం కొనుగోలుపై ఆశలు కలిగిస్తోంది. ఈ క్రమంలో సోమవారం కూడా బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1140 తగ్గి, రూ.1,24,480 పలుకుతోంది.

ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,050 తగ్గి రూ.1,14,100 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.1,70,000గా ఉంది. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,630 ఉంటే, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,250 పలుకుతోంది. ముంబైలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,480లు ఉంటే, 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,14,100 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,24,910, అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల గోల్డ్‌ ధర రూ.1,14,500 పలుకుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,24,480 ఉంటే, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,100 పలుకుతోంది. ఇక కేజీ వెండి రూ.1,70,000గా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర.. 3,500 పీవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు

తరుముకొస్తున్న మొంథా తుఫాన్‌.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్

నాగపంచమి వేళ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

ప్రైవేట్ బస్సులంటేనే హడల్‌.. ఆర్టీసీకి పెరిగిన ఆదరణ

అన్నం కోసం వస్తే.. ప్రాణమే పోయింది