Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధర..తులం ఎంతంటే..
బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా తగ్గింది. ఆల్ టైమ్ హై నుంచి గోల్డ్ రేట్ దిగివచ్చింది. అంతకన్నా ముందు బంగారం ధర భారీగా పెరగడంతో పసిడి ప్రేమికులు టెన్షన్ పడ్డారు. కానీ గురువారం బంగారం ధర తగ్గడం ఊరటనిచ్చింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 25, గురువారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం 1,16,850 రూపాయిలుగా ఉంది.
22 కేరట్ల బంగారం ధర తులం 1,08,200 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,38,600 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,14,590, 22 కేరట్ల ధర రూ.1,05,050 లుగా ఉంది. కేజీ వెండి ధర రూ.1,40,000 ఉంది. ముంబైలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,14,440, 22 కేరట్ల ధర రూ.1,04,900 ఉంది. వెండి ధర కేజీ రూ.1,40,000గా ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,14,660గా ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,05,100 గా ఉంది. వెండి ధర కేజీ రూ.1,50,000 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల ధర రూ.1,14,440, 22 కేరట్ల ధర రూ.1,04,900 గా ఉంది. వెండి ధర కేజీ రూ.1,42,600 ఉంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి మదుపరులు ప్రయారిటీ ఇస్తున్నారు. మరోవైపు..అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు సైతం బంగారాన్ని పెద్దఎత్తున కొంటున్నాయి. తద్వారా తమతమ కరెన్సీలు పతనం కాకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి కూడా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అంశాలన్నీ కలిసి గోల్డ్ ఫ్యూచర్స్‌కు డిమాండ్‌ను క్రియేట్ చేస్తున్నాయని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి అంటూ నమ్మించి.. నిలువునా దోచేసింది
తెలంగాణకు డబుల్ అలర్ట్ పొంచి ఉన్న అతి భారీవర్షాలు
ఇద్దరు భార్యల కథ.. ఒకరి భర్తకు మరొకరు అవయవదానం
GST Reforms 2025: జీఎస్టీ తగ్గింపు ఇవ్వటం లేదా? ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి
