Gold: ధర తగ్గిందని బంగారం కొంటున్నారా..? ఈ జాగ్రత్తలు మస్ట్..
Gold Buying Tips: బంగారం కేవలం అలంకారం మాత్రమే కాదు, సురక్షితమైన పెట్టుబడి. అయితే, కొనుగోలులో అవగాహన లేకుంటే మోసపోయే ప్రమాదం ఉంది. హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ వంటి వివరాలను సరిచూసుకోవడం అత్యవసరం. స్వచ్ఛత, ఖర్చులను అర్థం చేసుకోవడం ద్వారా వినియోగదారులు జాగ్రత్తగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం.. కేవలం సౌందర్యానికి మాత్రమే కాదు, ఆర్థిక భద్రతను అందించే ఒక ముఖ్యమైన పెట్టుబడి. అయితే, నేటి మార్కెట్‌లో బంగారం కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండటానికి కొన్ని కీలక సూచనలు అందిస్తున్నారు. మీరు కొంటున్న బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ ఉందో లేదో చెక్ చేసుకోంది. బంగారంలోని స్వచ్ఛత శాతంతో పాటు తయారీ ఛార్జీలు, తరుగు వంటి వివరాలను స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. బిల్లులో ఈ వివరాలన్నీ సక్రమంగా పొందుపరచబడ్డాయో లేదో ధృవీకరించుకోవాలి. కొనే బంగారానికి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటించడం ద్వారా మీ బంగారం కొనుగోలు సురక్షితంగా, లాభదాయకంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.