Gold Price: బంగారం మళ్లీ పెరిగిందిగా.. ఇవాళ తులం ఎంతంటే ??
కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు నవంబర్ 10న భారీగా పెరిగాయి. దీపావళి డిమాండ్, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 10 గ్రాముల 24K బంగారం రూ.1200, కిలో వెండి రూ.2000 పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో తాజా ధరలను ఈ కథనంలో చూడవచ్చు.
కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం వెండి ధరలు నవంబరు 10 సోమవారం మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది పండుగ సీజన్‌లో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. దీపావళికి ముందు వినియోగదారుల కొనుగోలు డిమాండ్ పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగడం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులపై దృష్టి కేంద్రీకరించడం వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధర సోమవారం మళ్లీ పెరిగింది. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 పెరిగి, రూ.1,23,220 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1100 పెరిగి రూ.1,12,950 కి చేరింది. కిలో వెండి పై రూ.2000 పెరిగి రూ.1,67,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో సోమవారం బంగారం, వెండి దరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,23,370, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,100 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,220 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,12,950 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,480, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,100 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,220, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,950 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,23,220 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,12,950 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.1,67,000 లుగా ఉంది. ఈ ధరలు ఉదయం 12 గంటల తర్వాత నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్లామర్ షో చాలు.. ఇక నటిస్తామంటున్న కుర్ర హీరోయిన్లు
Pawan Kalyan: కథలు రెడీ.. పవన్ రెడీగా ఉన్నారా
ముంబైలోనే సెటిల్ అవ్వాలని చూస్తున్న ఆ హీరోయిన్లు
