మళ్లీ దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు వీడియో
బంగారం ధరలు సామాన్యులకు అంతుచిక్కడంలేదు. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. నవంబరు 22 శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1860 పెరిగి, రూ.1,25,840 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,700 పెరిగి రూ.1,15,350 కి చేరింది.
కిలో వెండి పై రూ.3000 పెరిగి రూ.1,64,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,25,990, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,500 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,840 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,15,350 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,880, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,300 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,25,840 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,15,350 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.1,64,000 గా కొనసాగుతోంది.ఈ ధరలు ఉదయం 10 గంటల తర్వాత నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం :
