దూసుకుపోతున్న బంగారం ధర తులం ఎంతంటే
బంగారం ధరలు ఊహించని రీతిలో ఆకాశాన్నంటుతున్నాయి. దసరా రోజున తగ్గిన బంగారం ధర మళ్ళీ ఊపందుకుంది. ఒక్క సోమవారం రోజే 1250 రూపాయలు పెరిగింది. అటు..అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర మంగళవారం ఉదయానికి 77 డాలర్లకు పైగా పెరిగి 3964 డాలర్ల పైకి దూసుకెళ్లి సరికొత్త రికార్డ్ సృష్టించింది.
అమెరికా ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితి, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, దీపావళి, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్‌తో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 7, మంగళవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం 1,22,800 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం 1,13,710 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,55,400 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,070గా ఉండగా, 22 కేరట్ల తులం ధర రూ.1,12,000గా ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,020గా ఉండగా, 22 కేరట్ల తులం ధర రూ.1,11,850గా ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,050గా ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,11,850గా ఉంది. చెన్నైలో 24 కేరట్ల తులం బంగారం ధర రూ.1,22,180 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,12,000 ఉంది. కోల్‌కతా లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,120 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,11,850 ఉంది. ఇక.. వెండి ధర కూడా ఊహించని విధంగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో మంగళవారం కేజీ వెండి రేటు రూ.1000 మేర పెరిగి.. కేజీ రూ.1,66,000 మార్క్ వద్దకు చేరుకుంది. అయితే, ఢిల్లీ, ముంబై వంటి ప్రముఖ నగరాల్లో కేజీ వెండి రేటు రూ.1,56,000లకే లభిస్తోంది. ఏది ఏమైనా.. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై బంగారం, వెండి ధరలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాదీలు బీ అటెన్షన్ !! ఇది వింటే మీకు పండగే
10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఛాతీలోకి 7 బుల్లెట్లు.. వీరమరణం.. ‘కాంతార 2’ హీరోయిన్ తండ్రి ఎవరో తెలుసా ??
అనాథ పిల్లల కోసం మై హోం గ్రూప్ మరో బృహత్తర కార్యక్రమం
ఈజిప్టులో ఫారో చక్రవర్తి సమాధి.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న తలుపులు
