Elon Musk: “నా పెర్‌ఫ్యూమ్‌ కొనండి ప్లీజ్‌’ అంటూ.. సేల్స్‌మాన్‌లా ఎలన్‌ మస్క్‌.. ఎందుకంటే..(వీడియో)

Updated on: Oct 20, 2022 | 9:27 AM

టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ లేటెస్ట్‌ ట్వీట్‌ ఇంటర్నెట్‌లో చర్చకు దారి తీసింది. తాను కొత్తగా లాంచ్‌ చేసిన burnt hair పెర్‌ఫ్యూమ్‌ను ప్రమోట్ చేస్తూ ట్విటర్‌లో మరోసారి సంచలనం రేపుతున్నారు.


టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ లేటెస్ట్‌ ట్వీట్‌ ఇంటర్నెట్‌లో చర్చకు దారి తీసింది. తాను కొత్తగా లాంచ్‌ చేసిన burnt hair పెర్‌ఫ్యూమ్‌ను ప్రమోట్ చేస్తూ ట్విటర్‌లో మరోసారి సంచలనం రేపుతున్నారు. తనను తాను పెర్‌ఫ్యూమ్ సేల్స్‌మేన్‌గా పేర్కొన్న మస్క్‌ ‘‘నా బ్రాండ్‌ పెర్‌ఫ్యూమ్‌ను కొనండి ప్లీజ్‌.. మీరు కొంటే నేను ట్విటర్‌ను కొనుక్కుంటూ’’ అంటూ వేడుకున్నారు. దీనిపై లైక్‌లు, కమెంట్ల వర్షం ఒక రేంజ్‌లో కురుస్తోంది. 25 వేలకు పైగా రీట్వీట్లు విభిన్న కమెంట్లతో వైరల్‌గా మారింది. ఈ సందర్బంగా 20వేల బాటిల్స్ సేల్‌ అయ్యాయి. దీంతో ట్విటర్‌ కొనుగోలు అంశంపై చర్చను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. పెర్‌ఫ్యూమ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించిన మస్క్‌ ఓమ్నిజెండర్ పెర్‌ఫ్యూమ్‌ ఆడా మగా ఇద్దరికీ పనికి వస్తుందని వెల్లడించారు. సుమారు 100డాలర్లు అంటే 8,400 రూపాయలతో లాంచ్‌ వేసిన వెంటనే 10 వేల బాటిల్స్ సేల్‌ అయ్యా యంటూ ట్వీట్‌ చేయడమేకాదు, మిలియన్‌ బాటిల్స్‌ సేల్స్.. మీడియా వార్తలు.. అంటూ గప్పాలు కొట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 20, 2022 09:27 AM