Diwali Sales 2025: దీపావళి సేల్స్‌ ఎన్ని లక్షల కోట్లు దాటాయంటే.. జనం ఎక్కువగా మోజు పడ్డవి ఇవే

Updated on: Oct 24, 2025 | 6:21 PM

దీపావళి కాంతులతోనే కాదు, సేల్స్ పరంగా కూడా భారత్ వెలిగిపోయింది. ఈ ఏడాది దీపావళికి అక్షరాలా 6 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. వస్తువుల విభాగంలో 5.4 లక్షల కోట్లు, సేవల విభాగంలో 65 వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగాయి. ఈసారి దీపావళి షాపింగ్ కు జీఎస్టీ సంస్కరణలు బాగా కలిసొచ్చాయి. వివిధ రాష్ట్రాల్లోని మెట్రో నగరాలతో పాటు, పట్టణాల్లో ఈసారి దీపావళి షాపింగ్ జోరుగా సాగింది.

FMCG రంగంలో అత్యథికంగా 12 శాతం అమ్మకాలు జరగగా.. బంగారు ఆభరణాల విభాగం 10 శాతం విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. గ్రోసరీ, బంగారం తర్వాత ఎక్కువమంది ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేశారు.ప్రయాణాలు, టూర్స్, ఈవెంట్స్, డెకరేషన్ లాంటి సేవల విభాగంలో కూడా ఈ దీపావళికి 65 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఈసారి గమనించదగ్గ విషయం ఏంటంటే, ప్రధాన నగరాల కంటే, పట్టణాలు, మండల స్థాయి ప్రాంతాలలో 28 శాతం ఎక్కువ వ్యాపారం జరిగింది. గత దీపావళితో పోలిస్తే, ఈ దీపావళికి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ-కామర్స్ విభాగాల్లో 24 శాతం వృద్ధి కనిపించింది. జీఎస్టీ సంస్కరణలతో ఈ దీపావళికి భారతీయులు ఎక్కువగా కార్ల కొనుగోలు వైపు మొగ్గుచూపారు. ఒక్క టాటా మోటార్స్ లోనే 30 రోజుల్లో లక్షకు పైగా కార్లు డెలివరీ అయ్యాయి. ఇక ఆన్ లైన్ షాపింగ్, కొనుగోళ్ల విషయంలో.. గత దీపావళికి, ఈ ఏడాది దీపావళికి ట్రెండ్ లో పెద్దగా మార్పు రాలేదు. ఈ అమ్మకాల జోరు వచ్చే ఏడాది సంక్రాంతి వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. ఏమైందంటే

China: గంటకు 453 కి.మీ హై స్పీడ్‌ రైలును ఆవిష్కరించిన చైనా

Golden Dress: మెరిసిపోతున్న గోల్డెన్‌ డ్రెస్‌ చూసారా

Srikakulam: ఎస్పీ చూస్తుండగానే.. MLA పైకి రివాల్వర్ ఎక్కుపెట్టిన మంత్రి

నెల రోజులు.. 28 లక్షల కోట్లు అదీ మన యూపీఐ కెపాసిటీ బాస్

Published on: Oct 24, 2025 06:21 PM