Cisco: ఒకేసారి 4000 మందిని ఇంటికి పంపిన టెక్ దిగ్గజం.. కారణం ఇదే.!

|

Feb 17, 2024 | 6:57 PM

2023 మొత్తం లే ఆఫ్ లతో ఉక్కిరి బిక్కిరి అయిన టెక్కీలకు ఈ ఏడాది కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సిస్కో సిస్టమ్స్ సంస్థ తమ ఉద్యోగులను తొలగించనున్నట్లు రెండు రోజులకు ముందే ప్రకటించింది. ఉన్న ఉద్యోగుల్లో 5 శాతం మందిని ఇంటికి పంపనున్నట్లు ప్రకటించింది. చెప్పినట్టుగానే కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 4000 మందిని ఉద్యోగాలనుంచి తొలగించింది.

2023 మొత్తం లే ఆఫ్ లతో ఉక్కిరి బిక్కిరి అయిన టెక్కీలకు ఈ ఏడాది కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సిస్కో సిస్టమ్స్ సంస్థ తమ ఉద్యోగులను తొలగించనున్నట్లు రెండు రోజులకు ముందే ప్రకటించింది. ఉన్న ఉద్యోగుల్లో 5 శాతం మందిని ఇంటికి పంపనున్నట్లు ప్రకటించింది. చెప్పినట్టుగానే కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 4000 మందిని ఉద్యోగాలనుంచి తొలగించింది. కంపెనీ వ్యాపారాన్ని పునర్నిర్మించుకోవడంలో భాగంగానే.. ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, స్నాప్ చాట్ వంటి సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మందిని ఇప్పటికే ఇంటికి పంపింది. ఈ జాబితాలోకి ఇప్పుడు సిస్కో చేరింది.

2023లో కంపెనీలోని మొత్తం పనిచేసే ఉద్యోగుల సంఖ్య 85000 మంది. ఇందులో ఈ ఏడాది ఏకంగా 4000 మందిని తొలగించింది కంపెనీ. ఉద్యోగుల తొలగింపులపైన కూడా కంపెనీ 800 మిలియన్ డాలర్ల ఖర్చును భరించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఉద్యోగుల తొలగింపు చెల్లింపులు, ఇతర సంబంధిత ఖర్చులకు నిధులుగా సమకూర్చుతుంది. సిస్కో కంపెనీ ఇతర కంపెనీల మాదిరిగానే అనేక ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండవ త్రైమాసికంలో ఆదాయం 52.5 బిలియన్ డాలర్ల నుంచి 51.5 బిలియన్ల డాలర్లకు తగ్గింది. దీంతో కంపెనీ షేర్స్ కూడా 5 శాతానికిపైగా పడిపోయాయి. రానున్న రోజుల్లో కంపెనీ ఆదాయాన్ని మెరుగు పరుచుకోవడంలో భాగంగానే.. తాజాగా ఉద్యోగుల తొలగింపులను చేపట్టినట్టు పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..