BSNL యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.251తో సూపర్‌ ప్లాన్‌

Updated on: Apr 09, 2025 | 5:16 PM

ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తోంది. ఐపీఎల్‌ అంటే క్రికెట్‌ అభిమానులకు పండగే. దాదాపు నెలరోజులు సాగే ఈ టోర్నమెంట్‌ చిన్న,పెద్ద అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తారు. బెట్టింగ్‌ రాయుళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఐపీఎల్ అభిమానులకే కాకుండా ఎక్కవ శాతం డేటా వినియోగించే కస్ట్‌మర్స్‌ కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఓ సూపర్‌ రీచార్జ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

రూ.251 ధరతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది డేటా వోచర్… అంటే ఇందులో మరే ఇతర సేవలు అంటే కాలింగ్‌, ఎస్ఎంఎస్‌ సేవలు ఉండవు. ఈ ఐపీఎల్‌ 2025 సీజన్‌లో మొబైల్ డేటాను ఎక్కువగా వినియోగించే వినియోగ‌దారుల‌ను లక్ష్యంగా చేసుకుని రూ.251 డేటా వోచర్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్‌ తీసుకొచ్చింది. రూ. 251తో 251 జీబీ డేటా అందిస్తుంది. అంటే ఒక్కరూపాయికే 1 జీబీ డేటా అందిస్తోంది. యాక్టివ్ ప్లాన్‌తో సంబంధం లేకుండా 60 రోజుల కాల‌ప‌రిమితితో 251 జీబీ డేటాను ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే, చెల్లుబాటు అయ్యే బేస్ ప్లాన్ లేకుండా ఈ డేటా వోచర్‌ను యాక్టివేట్ చేయడం సాధ్యం కాదు. ఇక ఇటీవల బీఎస్ఎన్ఎల్‌ నెలకు రూ. 999 ధరకే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5000 జీబీ డేటాను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ మాత్రమే కాకుండా ఎయిర్‌టెల్‌ కూడా ఇటీవల ఉచిత జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ తో రెండు కొత్త క్రికెట్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్‌ నుంచి రూ.100 రీఛార్జ్ ప్లాన్ మొత్తం 5జీబీ డేటాతో పాటు జియో హాట్‌స్టార్ కు ఒక నెల ఉచిత యాక్సెస్ ను అందిస్తోంది. అలాగే రూ.195 ధర గల మరో ప్లాన్ 15జీబీ డేటాతో పాటు 90 రోజుల జియో హాట్‌స్టార్ ఉచిత‌ సబ్స్క్రిప్షన్ ను అందిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దూరపు బంధువుతో రహస్యంగా పెళ్లి.. ఆ తర్వాత..!

పాపం చిరుతకు ఎక్కడ దాక్కువాలో తెలియక.. ఏకంగా అక్కడ దాక్కుంది

లోను కట్టలేదని రంగంలోకి బ్యాంక్‌ మేనేజర్‌.. వచ్చి ఏకంగా దాన్నే ఎత్తుకుపోయారు

dilsukhnagar bomb blast: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??

Published on: Apr 09, 2025 05:15 PM