Bharat Rice: మార్కెట్‌లోకి భారత్ రైస్ .. కిలో రూ.29 లే.! వీడియో.
దేశంలో బియ్యం ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని 29 రూపాయలకే విక్రయించాలని నిర్ణయించింది. సబ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా , నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్, కేంద్రీయ భండార్ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించనున్నట్టు తెలుస్తోంది.
దేశంలో బియ్యం ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని 29 రూపాయలకే విక్రయించాలని నిర్ణయించింది. సబ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా , నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్, కేంద్రీయ భండార్ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమపిండి, పప్పుధాన్యాలను భారత్ ఆటా, భారత్ దాల్ పేరుతో తక్కువధరలకే అందిస్తోంది. నవంబర్‌లో తృణధాన్యాల ధరలు పదిశాతం పైగా ఎగబాకడంతో ఆహార ద్రవ్యోల్బణం 8.7 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం కట్టడికి, దేశంలో బియ్యం లభ్యతను పెంచేందుకు కేంద్రం భారత్ రైస్ పేరిట సబ్సిడీ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos