Ambani Wedding: అంబానీ ఇంట పెళ్లి సందడి.. స్టార్ హోటళ్లు ఫుల్.. ఒక్క రోజుకు లక్ష.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్‌ల వివాహం జులై 12న జరగనుంది. ఇందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతిథులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. దీంతో ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న స్టార్ హోటళ్లు ఇప్పటికే నిండిపోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఒక్క రాత్రి బసకు సుమారు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ట్రావెల్ ఏజెంట్ల వెబ్‌సైట్ల ద్వారా తెలుస్తోంది.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్‌ల వివాహం జులై 12న జరగనుంది. ఇందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతిథులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. దీంతో ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న స్టార్ హోటళ్లు ఇప్పటికే నిండిపోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఒక్క రాత్రి బసకు సుమారు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ట్రావెల్ ఏజెంట్ల వెబ్‌సైట్ల ద్వారా తెలుస్తోంది. బాంద్రా కుర్లా కాంప్లెక్సులో ఉన్న ట్రైడెంట్, ఒబెరాయ్ హోటళ్ల వెబ్‌సైట్ల ప్రకారం.. జులై 10 నుంచి 14 వరకు గదులు ఖాళీగా లేవు. ఆ చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక్కరాత్రి బస చేసేందుకు రూ.13 వేల నుంచి రూ.30 వేలుగా ఉండగా.. జులై 14న రూ.40 వేలుగా కనిపిస్తోంది. మరో హోటల్‌లో 14న ఏకంగా రూ.90వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. పన్నులు కలిపి ఇది మరింత పెరుగుతుంది. జులై 10, 11 తేదీల్లో మాత్రం ఖాళీగా లేవు.
బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 12న అనంత్ వివాహం జరగనుండగా.. 14 వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సమాచారం. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, 14న మంగళ్ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వివాహానికి వచ్చే అతిథులు ఎక్కడ బస చేస్తారనే విషయంపై అంబానీ కుటుంబం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపు వెళ్లే మార్గాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ముంబయి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. జులై 12 నుంచి 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ముంబయిలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఒకటి. ఈ పరిసర ప్రాంతాల్లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, ఇండియన్ ఆయిల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.