Mukesh Ambani: ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో స్టార్‌ హోటళ్లకు పండగ

Mukesh Ambani: ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో స్టార్‌ హోటళ్లకు పండగ

Subhash Goud

|

Updated on: Jul 12, 2024 | 10:13 AM

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ల వివాహం జులై 12న జరగనుంది. ఇందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతిథులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. దీంతో ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ ప్రాంతంలో ఉన్న స్టార్‌ హోటళ్లు ఇప్పటికే నిండిపోతున్నట్లు సమాచారం..

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ల వివాహం జులై 12న జరగనుంది. ఇందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతిథులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. దీంతో ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ ప్రాంతంలో ఉన్న స్టార్‌ హోటళ్లు ఇప్పటికే నిండిపోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఒక్క రాత్రి బసకు సుమారు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ట్రావెల్‌ ఏజెంట్ల వెబ్‌సైట్ల ద్వారా తెలుస్తోంది.

వివాహ వేడుక కోసం జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో కనీవినీ ఎరగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 1200 మంది అతిథులు ఈ వెడ్డింగ్‌కు హాజరవుతారు. ప్రపంచమంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి అన్నట్టుగా.. అంబానీ ఇంట్లో పెళ్లి అంగరంగ వైభవంగా జరుగనుంది. రిలయన్స్ గ్రూప్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె రాధిక మర్చంట్‌తో కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఇవాళ శుభ్ వివాహ్, రేపు శుభ్ ఆశీర్వాద్, ఎల్లుండి మంగళ్ ఉత్సవ్‌తో పెళ్లి వేడుకలు ముగుస్తాయి.