వృద్ధులకు గుడ్‌న్యూస్..! భారీగా పెరిగిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కవరేజ్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ PMJAY పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది. ఇప్పుడు ఈ కవరేజీని ₹5 లక్షల నుండి ₹10 లక్షలకు పెంచారు, ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు అదనపు టాప్-అప్ అందిస్తున్నారు. ఇది పేద కుటుంబాలకు నగదు రహిత, కాగిత రహిత వైద్య చికిత్సలను అందించి, వారి ఆరోగ్య భద్రతను పెంపొందిస్తుంది.
ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) అనే పథకం ప్రవేశ పెట్టింది. దీనిని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత ఆరోగ్య సంరక్షణను అందించడానికి 2018లో ప్రారంభించారు. ఈ పథకం కింద, కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుంది, ఇందులో వైద్య చికిత్సలు, మందులు, పరీక్షలు మరియు ప్రీ-హాస్పిటల్ ఖర్చులు వంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ కవరేజీని రూ.10 లక్షలకు పెంచారు. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ఈ ప్రత్యేక టాప్-అప్‌ను ప్రవేశ పెట్టారు. పేద మరియు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని తక్కువ-ఆదాయ కుటుంబాలకు సరసమైన, ఉచిత ఆరోగ్య సంరక్షణను అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం దేశవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఉపయోగించగల నగదు రహిత, కాగిత రహిత రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవర్‌ను అందిస్తుంది. ఇందులో అన్ని రకాల వ్యాధులు మొదటి రోజు నుండే కవర్ చేయబడతాయి. దీర్ఘకాలిక వైద్య పరిస్థితులు ఉన్న కుటుంబాలకు కూడా పూర్తి రక్షణను అందిస్తాయి. వయోపరిమితి లేదు, లింగ పరిమితి లేదు, కుటుంబ పరిమాణంపై ఎటువంటి పరిమితి లేదు. ఇక ఇది ఎవరెవరికి వర్తిస్తుందంటే.. ప్రాథమిక లబ్ధిదారుడు, జీవిత భాగస్వామి, పిల్లలు , తల్లిదండ్రులు, తాత,మామ్మలు. ఒకే ఇంట్లో నివసిస్తున్న సోదరులు, సోదరీమణులు, అత్తమామలు, ఇతర ఆధారపడినవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. సభ్యుల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేనందున, కుటుంబంలోని ప్రతి అర్హత కలిగిన వ్యక్తి స్వయంచాలకంగా కవరేజ్ పొందుతారు. గతేడాది 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు ప్రత్యేకంగా రూ.5 లక్షల అదనపు టాప్-అప్ హెల్త్ కవర్ అయ్యేలా ప్రభుత్వం యాడ్ చేసింది. ఇది ఫ్యామిలీ ఫ్లోటర్ పరిమితి నుండి వేరుగా ఉంటుంది. అటువంటి కుటుంబాలకు అందుబాటులో ఉన్న మొత్తం కవరేజీని సంవత్సరానికి రూ.10 లక్షలకు సమర్థవంతంగా పెంచుతుంది. ఆధార్ ప్రకారం 70 ఏళ్లు పైబడిన ఎవరైనా టాప్-అప్‌కు అర్హులు. మెరుగైన కవరేజ్‌ను యాక్టివేట్ చేయడానికి, సీనియర్ సిటిజన్ ఆధార్ eKYCని మళ్ళీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారం కొంటున్నారా.. బీకేర్‌ఫుల్ తక్కువ క్వాలిటీ బంగారంపై ప్యూరిటీ ముద్ర
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టిటిడి క్లారిటీ.. ఈసారి స్థానికులకు ఇంపార్టెన్స్
రాత్రి వేళ ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. కట్‌చేస్తే.. అంత బట్టబయలు
ఎస్వీ యూనివర్శిటీలో చిరుత ప్రత్యక్షం.. భయాందోళనలో విద్యార్ధులు
ఓటుకు నోటు వద్దే వద్దు.. కోతులను తరిమితే చాలు కొత్త సర్పంచ్ మీరే
