డోంట్ వర్రీ.. డెబిట్ కార్డు లేకుండానే ఈజీగా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు
ప్రస్తుతం యూపీఐ ద్వారా లావాదేవీలు జరుపుతున్నప్పటికీ.. అప్పుడప్పుడు నగదు అవసరమవుతుంటుంది. ఏటీఎం ల నుండి నగదు విత్ డ్రా చేయాలంటే డెబిట్ కార్డు తప్పనిసరి. కానీ, ఇకపై డెబిట్ కార్డు ఇంట్లో మరిచిపోయినా.. కార్డు లేకపోయినా..? డోంట్ వర్రీ.. ఏటీఎం డెబిట్ కార్డు లేకపోయినా చాలా సులువుగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్న సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పిస్తోంది.
గతంలో నగదు కోసం బ్యాంకులకు వెళ్లి ఖాతా నుంచి విత్ డ్రా చేసుకునే వాళ్ళు. ఆధునిక టెక్నాలజీ సహాయంతో నగదు విత్ డ్రా కోసం బ్యాంకర్లు ఏటీఎంలను ఏర్పాటు చేశాయి. పదేళ్ల క్రితం వరకు నగదు విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డుతో ఏటీఎం దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. ఇటీవల మొబైల్ యాప్ ఆధారిత పేమెంట్స్, డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలామంది ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. అయినా.. ఒక్కోసారి నగదు అవసరం రావచ్చు. ఆ సమయంలో ఏటీఎంకు వెళ్లి క్యాష్ విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డు తప్పనిసరి. అయితే డెబిట్ కార్డు అందుబాటులో లేకపోతే క్యాష్ విత్ డ్రా చేసుకోవడం కష్టంగా ఉండేది. కానీ ఆర్బిఐ వినియోగదారులకు కొత్త అవకాశాన్ని కల్పించింది. డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం వద్దకెళ్లి మనీ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఏటీఎంల వద్ద డెబిట్ కార్డు రహిత లావాదేవీలను నిర్వహించుకునేందుకు ఆర్బిఐ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసేందుకు యూపీఐ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. మొబైల్ యాప్స్.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల సాయంతో డెబిట్ కార్డు లేకున్నా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ ఆధారంగా డెబిట్ కార్డు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఏటీఎం స్క్రీన్‌పై యూపీఐ కార్డ్‌లెస్ క్యాష్ ఆప్షన్‌న్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత విత్‌డ్రా చేయాలనుకుంటున్న నగదు మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. విత్ డ్రా సెక్షన్‌లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే తాత్కాలిక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఫోన్‌లోని బ్యాంకు యూపీఐ ఆధారిత యాప్‌తో దాన్ని స్కాన్ చేయాలి. యూపీఐ పిన్‌ను యాప్‌లో ఎంటర్ చేయాలి. ఆ తరువాత ఏటీఎం నుంచి డబ్బులు బయటకు వస్తాయి. వెంటనే నగదు విత్‌డ్రా అయినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ కూడా వస్తుంది. యూపీఐ కార్డ్‌లెస్ విత్‌డ్రా లావాదేవీలపై రోజుకు కొన్నింటిపై కొన్ని బ్యాంకులు పరిమితులు విధించాయి. యూపీఐ కార్డ్‌లెస్ విత్‌డ్రా లావాదేవీల ఏటీఎంను భువనగిరి పట్టణంలో తొలిసారిగా ఏర్పాటు చేశారు. హితాచీ మనీస్పాట్ ఏటీఎం పేరుతో జగదేవ్‌పూర్ రోడ్డులో ఆవిష్కరించారు. క్రమంగా వీటిని రద్దీ ఏరియాలు, టూరిస్ట్ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా.. డేంజర్లో పడ్డట్లే!
విమానం కంటే వేగం ఈ రైలు.. గంటకు 600 కి.మీ
కంటి చూపును ఇచ్చే శైవక్షేత్రం వెల్లీశ్వరర్
మీ పాన్ కార్డ్ తో వేరే వాళ్లు లోన్ తీసుకున్నారా? ఏం చేయాలంటే
ఎంత లాగినా ఒడ్డుకు రాని వల.. తీరా చూస్తే షాక్! జాలరి దశ తిరిగిపోయింది