నవంబరు 1 నుంచి మారనున్న ఆధార్ రూల్స్
ఆధార్ కార్డ్‌దారులకు ఓ ముఖ్య సమాచారం. నవంబరు 1నుంచి ఆధార్‌కార్డ్ విషయంలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఈ మేరకు UIDAI పేర్క్ంది. అవును, ఇకపై ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలంటే ఉదయాన్నే ఆధార్ కేంద్రాలకు పరుగుపెట్టి, చాంతాడంత క్యూలో నిల్చుని టోకెన్ తీసుకుని పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు.
ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, జెండర్, చిరునామా, మొబైల్ నెంబర్ వంటి వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆధార్ కేంద్రం వరకూ వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. నవంబర్ 1 నుంచి ఈ మార్పులను ఇంట్లో కూర్చుని ఆన్ లైన్ లో ఎవరికి వారే మార్చేసుకోవచ్చని తెలిపింది. ఈమేరకు సరికొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చడం కోసమే ఈ కొత్త ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ అప్‌డేట్స్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సిందేనని తెలిపింది. మరో విషయం ఏంటంటే ఆధార్ అప్ డేట్ కు సంబంధించిన ఫీజులు కూడా పెరిగాయి. పేరు, అడ్రస్ మార్పులకు రూ.75, బయోమెట్రిక్ మార్పులకు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. 15 ఏళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్ మార్చేందుకు ఎలాంటి ఫీజు లేదని UIDAI పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాలజ్ఞాన మహిమ.. నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపుంజు
రజనీ-కమల్ కాంబోలో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన సౌందర్య, శ్రుతి
పాతిక చిత్రాల కౌంట్ తో దూసుకుపోతున్న రష్మిక
