KTR: మానవత్వాన్ని చాటిన కేటీఆర్‌.. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని..

|

May 23, 2024 | 6:57 AM

మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించేందుకు తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించి నిండు ప్రాణాన్ని రక్షించారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం కేటీఆర్‌ వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే...

మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించేందుకు తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించి నిండు ప్రాణాన్ని రక్షించారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం కేటీఆర్‌ వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారానికి నర్సంపేట వెళ్తున్న క్రమంలో వరంగల్ శివారు లేబర్ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదాన్నిగమనించారు కేటీఆర్‌. అంజయ్య (55) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైన రోడ్డు పక్కన అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

అంతలోనే అటుగా కాన్వాయ్‌తో వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌ ఈ విషయాన్ని గమనించి కారు దిగారు. అనంతరం తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో అంజయ్య ప్రాణాలతో బయటపడడంతో ఆయన కుటుంబ సభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞత తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో కూడా పలుమార్లు కేటీఆర్‌ ఇలా స్పందించి మంచి మనసును చాటుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..