‘బోటిం’ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు చేపట్టిన విజయ్ ఓలేటి

Updated on: Sep 13, 2025 | 2:04 PM

చెర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై పోలీసులు 11 కోట్ల రూపాయల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. విజయ్ ఓలేటి బోటిమ్ అనే యాప్ ద్వారా ముంబై డ్రగ్ నెట్వర్క్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. అతను ఫైజల్ ఖాన్‌కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలిసింది.

చెర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్‌పై ముంబై పోలీసులు దాడి చేసి, 11 కోట్ల రూపాయల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విజయ్ ఓలేటి అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తేలింది. రిమాండ్ రిపోర్టు ప్రకారం, ఓలేటి బోటిమ్ అనే యాప్ ద్వారా ముంబై డ్రగ్ నెట్‌వర్క్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. అతను ముంబై డ్రగ్ పెడ్లర్ ఫైజల్ ఖాన్‌కు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. లక్కడి కాపుల్లో ఫైజల్ ఖాన్‌కు డెలివరీ ఇచ్చినట్లు తెలిసింది. రెండు నెలల్లో 20 కిలోల డ్రగ్స్ విక్రయించినట్లు విచారణలో బయటపడింది. ముంబైలో పెడ్లర్ల అరెస్టుతో ఈ హైదరాబాద్ లింక్ బయటపడింది. నిందితుల సమాచారంతోనే వాగ్దేవి ల్యాబ్స్‌పై దాడి జరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచ యాత్రకు మహిళా సాహసికులు!

ఆ దేశాలకు ఇవి తీసుకెళుతున్నారా? అయితే జైలే

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడికి 27 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే..

RBI NEW RULE : ఈఎంఐ కట్టకపోతే మీ ఫోన్‌ లాక్‌! ఆర్బీఐ కొత్త రూల్‌