రెండోసారి చోరికి వచ్చి.. జనానికి దొరికిపోయిన దొంగలు

Edited By: Phani CH

Updated on: Nov 14, 2025 | 5:00 PM

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో రెండు రోజుల పాటు దొంగలు రెచ్చిపోయారు. మొదటి దొంగతనంలో ఇత్తడి సామాగ్రి చోరీ చేయగా, మంగళవారం రాత్రి రెండోసారి దొంగతనానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన స్థానికులు దొంగలను పట్టుకుని చితకబాదారు. పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనాస్థలానికి చేరుకుని దొంగలను అరెస్టు చేశారు. చోరీ సొత్తును రికవరీ చేశారు.

సికింద్రాబాద్ లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెండు రోజుల పాటు రెచ్చిపోయారు.. దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు చితకబాదారు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంసాలి బజార్, రామాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రోజున మొదట ఇద్దరు ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడారు. ఇంట్లో ఉన్న విలువైన ఇత్తడి సామాగ్రిని చోరీ చేశారు..అప్పటి నుండి దొంగల వార్త ఆ నోట ఈ నోటా తెలిసి అందరూ అలెర్ట్ గా ఉన్నారు. మంగళవారం రాత్రి మళ్లీ దొంగతనానికి ప్రయత్నించిన దుండగులు ఈసారి తప్పించుకోలేకపోయారు. ఇంతకుముందే అనుమానం వచ్చిన స్థానికులు రాత్రంతా కాపు కాసి దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్‌ చేశారు. అర్థరాత్రి సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నిస్తుండగా ప్రజలు వారిపై దాడి చేసి పట్టుకున్నారు. కోపంతో ఊగిపోయిన జనాలు వారిని చితకబాదడమే కాకుండా స్తంభానికి కట్టి బోయిన్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు దొంగలించిన మూడు ఇత్తడి తాంబాలాలు, సుమారు 12 కిలోల బరువు ఉన్న సామాగ్రిని ఫతేనగర్‌లోని ఓ షాపులో విక్రయించినట్లు విచారణలో తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, దొంగలను తమ అదుపులోకి తీసుకున్నారు. దొంగలించిన సామాగ్రిని రికవరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఇద్దరినీ విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ రోడ్డు కింద 5 వేల టన్నుల బంగారం.. ఎక్కడంటే ??

ఆ సమస్యలకు చెక్ పెట్టె విధంగా.. హైవేలపై QR కోడ్​ బోర్డులు

వింత ఘటన.. గేదెకు ఒకే ఈతలో రెండు లేగ దూడలు

వివాహ వేదికపై పుష్-అప్‌లు ఇప్పుడిదో నయా ట్రెండ్‌

RBI: బంగారం కాకుండా ఈ లోహంతో లోన్ తీసుకోవచ్చా? ఎంత ఇస్తారు?

Published on: Nov 14, 2025 04:56 PM