విశాఖ జూలో ‘ఘోస్ట్ ఆఫ్ జంగిల్’

Updated on: Apr 29, 2026 | 4:35 PM

విశాఖ జూకు నాలుగు దశాబ్దాల తర్వాత 'రెజీమా' అనే నల్ల చిరుత చేరుకుంది. 'యానిమల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్'లో భాగంగా గౌహతి జూ నుంచి వచ్చిన ఈ ఆడ చిరుత, ఇప్పుడు జూకు కొత్త ఆకర్షణగా నిలిచింది. దీని ప్రత్యేక ఆహార ప్రణాళిక, సంరక్షణతో పాటు, 'ఘోస్ట్ ఆఫ్ జంగిల్'గా పిలవబడే ఈ అరుదైన జీవిని చూసేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు.

విశాఖ జంతు ప్రదర్శనశాలకు సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక అరుదైన అతిథి వచ్చింది. మెరిసే కళ్లు, నిగనిగలాడే నల్లటి శరీరంతో ‘ఘోస్ట్ ఆఫ్ జంగిల్’గా పిలిచే నల్ల చిరుత సందర్శకులను కట్టిపడేస్తోంది. గౌహతిలోని అస్సాం స్టేట్ జూ నుంచి ‘యానిమల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’లో భాగంగా నాలుగేళ్ల వయసున్న ఈ ఆడ చిరుతను విశాఖకు తీసుకువచ్చారు. దీనికి ‘రెజీమా’ అని పేరు పెట్టారు. సెంట్రల్ జూ అథారిటీ పర్యవేక్షణలో జరిగిన ఈ జంతు మార్పిడి తర్వాత, నెలన్నర పాటు ప్రత్యేక క్వారంటైన్‌లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. అంతా బాగుందని నిర్ధారించుకున్నాక, దీనిని ఎన్‌క్లోజర్‌లో వదిలారు. ఈ అరుదైన అతిథి సంరక్షణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ముఖ్యంగా రెజీమా డైట్ ప్లాన్ చాలా ప్రత్యేకం. జూ క్యూరేటర్ తెలిపిన వివరాల ప్రకారం, దీనికి ప్రతిరోజూ ఉదయం ఒక కిలో చికెన్, మధ్యాహ్నం 2 నుంచి 3 కిలోల వరకు బీఫ్‌ను ఆహారంగా అందిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జూలో నల్ల చిరుత సందడి మొదలైంది. ఈ అరుదైన జీవిని కళ్లారా చూసేందుకు నగరవాసులు, పర్యాటకులు జూకి పోటెత్తుతున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత జూలో చేరిన ఈ కొత్త అతిథిని చూసి సందర్శకులు మురిసిపోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..

భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే

ఎండలకు పొట్ట ఉబ్బరమా ?? మీ మీల్ ప్లాన్ ఎలా ఉండాలంటే !!

వేసవిలో ‘సైలెంట్ కిల్లర్‌’ లోలోపలే ఉడికిపోతున్న జనం !! ఏసీలో ఉన్నా తప్పని ముప్పు !!

Follow Us