Mulugu: పొలానికి వెళ్తుండగా కనిపించిన ఏదో ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా.!
ఆ గ్రామంలోని రైతులు ఎప్పటిలానే రోజూ తెల్లారేసరికి తమ గడ్డిపార, పనిముట్టు సామాన్లు పట్టుకుని పొలానికి బయల్దేరారు. వారంతా కూడా వారి ఇళ్ళ దగ్గర నుంచి కొంతదూరం వెళ్లేసరికి రోడ్డువైపు ఒక పక్కన ఏదో ఆకారంలా కనిపించింది. దూరంగా ఉన్నారు కాబట్టి అది ఏంటో వారికీ అర్ధం కాలేదు. కొంచెం దగ్గరకు వెళ్లారు. ఏంటని చూడగా దెబ్బకు షాకయ్యారు.
ములుగు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. స్థానిక వెంకటాపురం మదలం బెస్తగూడెం గ్రామ శివారులో రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు. ఘటనాస్థలంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పాటు క్షుద్రపూజలు నిర్వహించినట్టు ఆనవాళ్లను గ్రామస్తులు గుర్తించారు. పొలం పనులకు వెళ్తున్న రైతులు ఇవి చూసి షాక్‌కు గురయ్యారు. క్షుద్రపూజల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయోనని సమీప గ్రామాలప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా, దీని బాధ్యులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు గ్రామస్తులు. ఇదొక్కటే కాదు.. ములుగు జిల్లాలో గతంలోనూ పలు చోట్ల క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుప్తనిధుల వెతుకులాటలో భాగంగా కూడా కొంతమంది ఇలా క్షుద్రపూజలు చేస్తారని తెలుస్తోంది.
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

