Big News Big Debate LIVE: సాగర తీరన అలజడి రేపుతోన్న రాజకీయాలు.. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌

|

Aug 14, 2023 | 8:23 PM

సీఎంపై ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎంతమంది పోలీసులతో అడ్డుకుంటారని ప్రశ్నించారు పవన్‌. సీఎం అయినా, పీఎం అయినా రీకాల్‌ చేసే హక్కు ప్రజలకు ఉందన్నారు. ఈజిప్టులోనూ ప్రజాఉద్యమానికి అధ్యక్షుడే పారిపోయారన్నారు. అయితే పవన్‌ కల్యాణ్‌ అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రుషికొండ నిర్మాణాలపైనా పవన్‌ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వం నిర్మించే భవనాలు ఎలా వాడుకోవాలన్నది ఆయా ప్రభుత్వాలు నిర్ణయిస్తాయన్నారు సజ్జల...

సాగర తీరం వేదికగా సెగలు కక్కుతోంది ఏపీ రాజకీయం. విశాఖలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ అధికారపార్టీని టార్గెట్‌ చేశారు. అంతే ధీటుగా వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. జనాలు ఓట్లు వేస్తే సీఎం పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌. సంకీర్ణం వచ్చినా ఓకే కానీ.. వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుని తీరుతామంటున్నారు పవన్‌ కల్యాణ్‌. ఎన్నిచోట్ల పోటీ చేస్తారో ముందు చెబితే భాగుంటుందన్నారు ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

సీఎంపై ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎంతమంది పోలీసులతో అడ్డుకుంటారని ప్రశ్నించారు పవన్‌. సీఎం అయినా, పీఎం అయినా రీకాల్‌ చేసే హక్కు ప్రజలకు ఉందన్నారు. ఈజిప్టులోనూ ప్రజాఉద్యమానికి అధ్యక్షుడే పారిపోయారన్నారు. అయితే పవన్‌ కల్యాణ్‌ అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రుషికొండ నిర్మాణాలపైనా పవన్‌ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వం నిర్మించే భవనాలు ఎలా వాడుకోవాలన్నది ఆయా ప్రభుత్వాలు నిర్ణయిస్తాయన్నారు సజ్జల.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Aug 14, 2023 07:03 PM