వర్షాకాలంలో చర్మసౌందర్యానికి ఇంటి చిట్కాలు

|

Jul 19, 2024 | 8:01 PM

వర్షాకాలంలో వేలాది చర్మ సమస్యలు చుట్టుముడతాయి. దురద, ముఖంపై మొటిమల సమస్యలు దాడి చేస్తాయి. ఈ కాలంలో చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల సమస్యను పూర్తిగా పరిష్కరించలేం. అయితే వర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం ఇంటి చిట్కాలు ఎల్లప్పుడూ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. పైగా వీటివల్ల దుష్ప్రభావాల భయం ఉండదు. మెరిసే చర్మాన్ని పొందడం చాలా సులభం. ముఖ్యంగా వర్షాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఓట్స్ భలేగా ఉపయోగపడతాయి.

వర్షాకాలంలో వేలాది చర్మ సమస్యలు చుట్టుముడతాయి. దురద, ముఖంపై మొటిమల సమస్యలు దాడి చేస్తాయి. ఈ కాలంలో చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల సమస్యను పూర్తిగా పరిష్కరించలేం. అయితే వర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం ఇంటి చిట్కాలు ఎల్లప్పుడూ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. పైగా వీటివల్ల దుష్ప్రభావాల భయం ఉండదు. మెరిసే చర్మాన్ని పొందడం చాలా సులభం. ముఖ్యంగా వర్షాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఓట్స్ భలేగా ఉపయోగపడతాయి. రోజ్ వాటర్, పెరుగు, తేనెతో ఓట్స్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై దద్దుర్లు, మొటిమల సమస్యల నుంచి కాపాడుతుంది. వర్షా కాలంలో చర్మం జిడ్డుగా మారకుండా ఉండటానికి రోజ్ వాటర్‌ను ముల్తానీ మట్టితో కలిపి ముఖానికి రాసుకోవచ్చు. ముల్తానీ క్లే ఫేస్ ప్యాక్ ఆయిల్ స్కిన్ సమస్యలను తక్షణం దూరం చేస్తుంది. అలాగే మొటిమలు, దద్దుర్లు సమస్యను తొలగించడానికి పసుపు బాగా పనిచేస్తుంది. పెరుగు, శెనగపిండితో పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వర్షాకాలంలో చర్మ సమస్యలను దూరం చేస్తుంది. మొటిమలు, ముడతలు, దద్దుర్లు వంటి వాటికి పరిష్కారం పొందడానికి తులసి ఆకులను కూడా ఉపయోగించవచ్చు. తాజా తులసి ఆకుల పేస్ట్‌ను రోజ్ వాటర్‌తో కలిపి, అందులో పెరుగును కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత ముఖం కడిగేసుకోవాలి. వర్షాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ నీటిలో కలిపి ముఖంపై అప్లై చేసుకోవాలి. దీనిని టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని ప్రయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ మన తెలుగింటి అల్లుడే

చంద్రుడిపై భారీ గుహ !! మరో వందకు పైగా ఉంటాయని సైంటిస్టుల అంచనా

సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు !! నైవేద్యంగా మటన్ కర్రీ !!

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్‌ రెడీ.. ఇక చెన్నైకి కేవలం 5 గంటల్లోనే..

కాకిని పట్టుకుని కట్టేసిన దుకాణదారుడు !! నిరసనగా దండెత్తిన వందలాది కాకులు