Andhra: ఏపీ అసెంబ్లీలో ఇంట్రస్టింగ్ సీన్.. పవన్‌తో బాలయ్య భేటీ
వారిద్దరూ అగ్ర హీరోలు.. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో పవర్ ఫుల్ పొలిటీషన్స్. పార్టీలు వేరైనా.. ఇప్పుడు ఒకే కూటమిగా కలిసి పని చేస్తున్నారు. తాజాగా వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ బాలయ్య, పవన్ ఏ అంశాలపై చర్చించారు ... ?
ఏపీ అసెంబ్లీలో ఓ ఇంట్రస్టింగ్ సీన్ కనిపించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసారు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ. నేరుగా పవన్ ఛాంబర్‌కి వెళ్లి కొన్ని అంశాలపై చర్చించారు బాలయ్య. ఇద్దరూ కలిసి ఇలా సమావేశం అవ్వడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.గతంలో అన్‌స్టాపబుల్ షో టైమ్‌లో వీళ్లద్దరూ కలిసారు. అధికారిక కార్యక్రమాల్లో ఎదురుపడ్డప్పుడు మర్యాదపూర్వక పలకరింపులు తప్ప ఇలా సమావేశం అయిన సందర్భాలు లేవు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగనట్టు చెప్తున్నారు.