మమ్మల్ని క్షమిస్తావా ఆయేషా..? ఇంత పెద్ద వ్యవస్థలు ఉండి ఒక్క ఆడబిడ్డకు న్యాయం చేయలేకపోయాం..
ఈకేసులో తమకు న్యాయం దక్కలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు ఆయేషామీరా తల్లి. ఈరోజు ఆయేషాతోపాటే సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని ఈ వ్యవస్థలు సమాధి చేశాయన్నారు. తాము మైనార్టీలం కాబట్టే న్యాయం జరగలేదన్నారు ఆయేషా మీరా తల్లి. సీబీఐ ఆధారాలు లేవని కేసు మూసేశారని... తమకు చేతకాలేదని సీబీఐ చెబితే బాగుండేదంటూ భావోద్వేగంతో మాట్లాడారు ఆయేషా మీరా తండ్రి. పద్మా లేడీస్ హాస్టల్‌లో ఆరోజు రాత్రి ఏం జరిగిందో తమకు తెలియాలంటూ డిమాండ్ చేశారు.
19ఏళ్ల నిరీక్షణ ఫలించలేదు. రెండు దశాబ్దాల కడుపుకోతకు న్యాయం దక్కలేదు. ఇప్పుడు వారి చేతిలో కూతురు అవశేషాలు తప్ప ఏదీ మిగల్లేదు. ఆయేషా మీరా తల్లిదండ్రులు పుట్టెడు ధుఃఖంతో.. విషణ్ణ వధనంతో సీబీఐ కోర్టులో ఆమె అవశేషాల కోసం నిలబడడం అందర్నీ కలచివేసింది. అవి అందుకున్నప్పుడు ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు.. ఈ దేశం మొత్తాన్ని దోషులుగా నిలబెట్టాయ్.. ఇప్పుడు ఆమె చావు వెనుక కారకులతో పాటు ఆమె అవశేషాలు సైతం సమాధి చేయబడ్డాయ్.. ఇంత పెద్ద వ్యవస్థలు ఉండి.. ఒక్క ఆడబిడ్డకు న్యాయం చేయలేకపోయాం.. సిగ్గుగా ఉంది.. మమ్మల్ని క్షమిస్తావా ఆయేషా… ?
Follow Us