పేద యువత బతుకును.. ఫుట్‌బాల్‌తో మార్చిన రాథోడ్

Updated on: Sep 18, 2025 | 7:57 PM

నిరుపేద యువత మందుకు, మత్తుకు అలవాటై భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. చదువుకోవాల్సిన వయసులో పెళ్లిళ్లు చేసుకొని కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ చూస్తూ పెరిగాడు ముంబైలోని అంబేడ్కర్‌నగర్‌ స్లమ్ ఏరియాకు చెందిన అశోక్ రాథోడ్. మద్యపానం, మత్తు పదార్థాల వినియోగం, బాల్య వివాహాలు, స్కూల్‌ డ్రాపౌట్ సమస్యల నుంచి చిన్నారులను కాపాడే లక్ష్యంతో పనిచేసాడు అశోక్ రాథోడ్‌.

పిల్లలు మైదానంలో ఉంటే వీధుల్లో ఉండరు అనే ఆలోచనతో 2006లో ”ఆస్కార్ ఫౌండేషన్” స్టార్ట్ చేశాడు. వారాంతాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించాడు. అశోక్‌ మిషన్‌కు మొదట 18 మంది పిల్లలు ఆకర్షితులయ్యారు ఆ తర్వాత వందలాది మంది చేరారు. ఆ కృషి ఫలితంగా ఇటీవల అతనికి ప్రభుత్వం “రియల్ హీరో అవార్డు”తో సత్కరించింది. “రియల్ హీరో అవార్డు”తో పాటు అశోక్‌కు రూ. 3.45 లక్షలు క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఐతే.. దాంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా సొంతానికి వాడుకోలేదు. పిల్లలకి బూట్లు, జెర్సీలు కొన్నాడు. ఫుట్‌బాల్ పేరుతో యువతను చెడగొడుతున్నాడని కొందరు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా అశోక్ వెనక్కి తగ్గలేదు. పిల్లలను ఫుట్‌బాల్‌కు అలవాటు చేసి.. ఆ తర్వాత ”స్కూల్‌కు వెళ్లకపోతే.. ఫుట్‌బాల్ ఉండదు” అనే నియమాన్ని దినచర్యగా మార్చాడు. ‘ఆస్కార్ ఫౌండేషన్” కృషితో పిల్లలకి చదువుపై శ్రద్ధ పెరిగింది. టీమ్‌వర్క్, క్రమశిక్షణ అలవడింది. గత 13 ఏళ్లలో 15 వేల మంది అంబేడ్కర్‌ నగర్‌ మురికివాడ చిన్నారులు డిగ్రీ పట్టా పొందారంటే అది అశోక్ రాథోడ్‌ కృషి వల్లే సాధ్యమైంది. చదువు స్కూల్‌కు దగ్గర చేస్తే.. ఫుట్‌బాల్ ఆత్మస్థయిర్యంతో జీవించేలా చేసింది. అందుకే ఈ రెండింటినీ జోడించి జీవితాన్ని మార్చుకోవచ్చని నిరూపించారు అశోక్‌ రాథోడ్‌. కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, డామన్ డయ్యూలో 600 మంది టీచర్లు శిక్షణ ఇచ్చింది ”ఆస్కార్ ఫౌండేషన్”. తద్వారా 20 వేల మంది పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: మిరాయ్‌ హీరోకు కోట్ల విలువ చేసే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్

OG గన్స్‌ అండ్ రోజెస్‌తో.. సోషల్ మీడియాలో అగ్గి పుట్టిస్తున్న తమన్‌

మీ తీరు నాకు నచ్చలేదు !! తెలుగు ట్రైలర్‌ పై నొచ్చుకున్న స్టార్ కమెడియన్

Hyderabad Rains: కుంభవృష్టితో వణికి పోయిన భాగ్యనగరం

SR Nagar: గాలివానకు కాలేజీ భవనంపై విరిగిపడిన భారీ వృక్షం