అమ్మమ్మకు మెసేజ్‌ పంపిన కో పైలట్‌ శాంభవి.. చివరికి..

Updated on: Jan 31, 2026 | 11:56 AM

బారామతి విమాన ప్రమాదంలో మరణించిన కో-పైలట్ శాంభవి పాఠక్ కథ ఇది. తన చివరి 'గుడ్‌ మార్నింగ్' మెసేజ్‌తో అమ్మమ్మను కన్నీరు పెట్టిన 25 ఏళ్ల శాంభవి, ఏర్‌ఫోర్స్ పైలట్ కుమార్తె. న్యూజిలాండ్‌లో శిక్షణ పొంది, అంతర్జాతీయ రూట్లలో విమానాలు నడిపిన ఆమె, ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలిచింది. ఆమె అకాల మరణం కుటుంబంతో పాటు గ్వాలియర్‌ ప్రజలనూ కలిచివేసింది.

బారామతిలో అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమాన ప్రమాదం కో-పైలట్ శాంభవి పాఠక్ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో 25 ఏళ్ల శాంభవి ఒకరు. మృత్యు కౌగిట్లోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఆమె తన అమ్మమ్మకు పంపిన గుడ్‌ మార్నింగ్ మెసేజ్‌ ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. గ్వాలియర్‌లో నివసిస్తున్న శాంభవి అమ్మమ్మ మీరా పాఠక్ తన మనవరాలి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీరు పెడుతున్నారు. ఉదయం శాంభవి నుంచి తనకు ‘గుడ్ మార్నింగ్’ మెసేజ్ వచ్చిందనీ సాధారణంగా ఆమె అంతగా మెసేజ్‌లు చేయదు, కానీ ఆ రోజు ఎందుకో చేసిందనీ అదే తన నుంచి వచ్చిన ఆఖరి మాట అని ఊహించలేదు అంటూ ఆమె బాధపడ్డారు. అదే రోజు ఉదయం 11 గంటలకు శాంభవి ఇక లేదన్న వార్త ఆమెకు చేరింది. శాంభవి తండ్రి విక్రమ్ పాఠక్ ఎయిర్‌ ఫోర్స్‌లో రిటైర్డ్ పైలట్. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న శాంభవి, న్యూజిలాండ్‌లో కమర్షియల్ పైలట్ శిక్షణ పూర్తి చేసింది. 25 ఏళ్ల వయసులోనే ఢిల్లీ, లండన్, రష్యా రూట్లలో విమానాలు నడిపి తన ప్రతిభను చాటుకుంది. చిన్నతనంలో గ్వాలియర్‌లోని ఎయిర్ ఫోర్స్ స్కూల్‌లో చదివిన ఆమె, ఎప్పుడు నగరానికి వచ్చినా తన అమ్మమ్మను కలవకుండా వెళ్లేది కాదని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. తెలివైన, చురుకైన యువ పైలట్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం గ్వాలియర్‌లో ఇంటి ఇరుగు పొరుగువారిని సైతం షాక్‌కు గురిచేసింది. ఎంతో మంది ఆడపిల్లలు పైలట్‌ వృత్తిని ఎంచుకోవడానికి రోల్‌ మోడల్‌గా నిలిచారు శాంభవి. ఘాజీపూర్‌ లాంటి చిన్న పట్టణం నుంచి వచ్చి ఆకాశాన్ని తాకిన ఆమె ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Medaram Jathara: తెలంగాణ కుంభమేళా.. మేడారం జాతర విశిష్టత ఏంటంటే..

Medaram Jatara 2026: మేడారంలో వెలసిన సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పాయింట్లు

అమెరికా యుద్ధనౌకలు పశ్చిమాసియాలోకి ఇరాన్‌తో యుద్ధం తప్పదా

Black Egg: నల్ల కోడి గుడ్డు తిన్నారా ?? తింటే ఆయుష్షు పెరుగుతుందట

తల్లిదండ్రుల హత్య కేసులో కూతురు సురేఖ అరెస్ట్