వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌

|

Nov 04, 2024 | 10:05 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి వచ్చే ఏడాది జరగనున్న పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. మానసిక వైకల్యం గల విద్యార్థులకు పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను పాఠశాల విద్యాశాఖ కుదించింది. ఇప్పటి వరకు 35 ఉన్న పాస్‌ మార్కులను 10 మార్కులకు తగ్గించింది.

వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నుంచి ఈ విధానం అమలు చేయనుంది. ఈ పరీక్షలు రాసే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉండే మినహాయింపులను ప్రస్తావిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం మార్గదర్శకాలు విడుదల చేసింది. మెంటల్‌ రిటార్డేషన్‌ స్థానంలో మేథో వైకల్యంగా పేరు మార్చింది. అంతేకాకుండా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణత మార్కులు 35కు బదులుగా 10 మార్కులుగా మారుస్తూ ప్రకటన జారీ చేసింది. అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టులో పది మార్కులు వస్తే చాలు.. వారిని ఉత్తీర్ణులుగా టెన్త్‌ క్లాస్ బోర్డు పరిగణిస్తుందని పేర్కొంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది నుంచి ఆరు పేపర్లుగా పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పేపర్‌–1, పేపర్‌–2 విధానానికి స్వస్తి పలికారు. దీనికి బదులుగా ప్రతి పేపర్‌లోనూ పార్ట్‌–ఎ, పార్ట్‌–బిలు ఉంటాయి. ఇంతకుముందు జరిగిన పేపర్‌–1,పేపర్‌–2 విధానంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు

ఆ ఊరిలో 70 ఏండ్ల నుంచి దీపావళి నిషేధం.. ఎందుకో తెలుసా ??

నల్ల గేదెకు తెల్ల దూడ పుట్టదా ??

రూ.72 లక్షలు.. ఒక్క ఫోన్ కాల్‌తో ఔట్ !!

ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలల కష్టం !! చివరికి ఏమైందంటే ??

Follow us on