Andhra Pradesh: పదవులు అనుభవించి ఇలా అనడం సరికాదు, ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన

|

Feb 13, 2024 | 12:21 PM

తాజాగా ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శిస్తూ జంగా క్రిష్ణమూర్తి వ్యాఖ్యలు చేశారు. బీసీలకు సరైన న్యాయం చేయడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎదురు దాడికి దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి చెల్లు బోయిన...

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడేక్కుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నా వేళ, రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఓవైపు పొత్తులతో ప్రతిపక్షాలు హడావుడి చేస్తుంటే. మరోసారి అధికారంలోకి రావాలని అధికార వైసీపీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీలోనూ కొన్ని ధిక్కారా స్వరాలు సైతం వినిపిస్తున్నాయి.

తాజాగా ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శిస్తూ జంగా క్రిష్ణమూర్తి వ్యాఖ్యలు చేశారు. బీసీలకు సరైన న్యాయం చేయడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎదురు దాడికి దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణ, క్రిష్ణమూర్తిపై కౌంటర్‌ అటాక్‌ చేశారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రెండు పదవులు అనుభవించి అతనను ఆశించింది రాలేదని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. బీసీల అధ్యయన కమిటీకి జంగాను అధ్యక్షుడిగా పెట్టి ఈరోజు వరకు కొనసాగించిన వ్యక్తి జగన్ అని, బీసీల ఆత్మగౌరవాన్ని రక్షిస్తున్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సరికాదని కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారంటూ జంగాను విమర్శించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow us on