ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు

Updated on: Dec 23, 2025 | 2:20 PM

ఏపీ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌లో మార్పులు జరిగాయి. హోలీ, రంజాన్‌ పండుగల కారణంగా మార్చి 3, మార్చి 20న జరగాల్సిన పరీక్షలు వరుసగా మార్చి 4, మార్చి 21కి వాయిదా పడ్డాయి. బ్యాక్‌లాగ్‌, నైతికత, పర్యావరణ పరీక్షలు జనవరి 21, 23 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1 నుండి 10 వరకు ఉంటాయి. విద్యార్థులు కొత్త షెడ్యూల్‌ను గమనించగలరు.

ఏపీ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్ష టైం టేబుల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల కూటమి సర్కార్‌ 2026 సంవత్సరానికి సెలవుల క్యాలెండర్‌ ను విడుదల చేసింది. అందులో హోలీ, రంజాన్‌ పండగల సెలవు రోజుల్లో ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల తేదీలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు సబ్జెక్టుల పరీక్షల తేదీలను మార్పు చేసినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి రంజిత్‌ బాషా తెలిపారు. మిగతా పరీక్షల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని, ఆయా తేదీల్లో యథాతథంగా జరుగుతాయని వెల్లడించారు. సెకండ్ ఇయర్‌ మ్యాథ్స్ పేపర్‌ 2ఏ, సివిక్స్‌ పేపర్‌ 2 పరీక్షలు గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 3న జరగాల్సి ఉంది. మార్చి 3న హోలీ పండగ ఉండటంతో ఈ పరీక్షలను మార్చి 4కు మార్చారు. మార్చి 20న జరగాల్సిన మొదటి ఏడాది పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, లాజిక్‌ పరీక్షల రోజున రంజాన్‌ పండగ సెలవు వచ్చింది. దీంతో ఈ పరీక్షలను మార్చి 21వ తేదీన నిర్వహిస్తారు. ఈ మేరకు టైం టేబుల్‌లో మార్పులు చేసినట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ సిలబస్‌ మారడంతో పాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చేయడంతో ఫస్ట్‌ ఇయర్‌ బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులకు ప్రత్యేకంగా షెడ్యూల్‌ ఇచ్చారు. నైతికత, మానవ విలువల పరీక్షలు జనవరి 21న, పర్యావరణ పరీక్ష జనవరి 23న నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇక ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూరియా బుకింగ్ షురూ.. ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలి అంటే

ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్‌.. ఆ తర్వాత

కూలిపోతున్న ఉపగ్రహం.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు

శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..

వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే