విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీలో పెరిగిన దసరా సెలవులు

Updated on: Sep 20, 2025 | 1:48 PM

సెలవులు వస్తున్నాయంటే విద్యార్ధులకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. అదీ వరుసగా 10 రోజులు సెలవులు అంటే.. ఇక వారి ఆనందం మాటల్లో చెప్పలేం. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 10 రోజులు దసరా సెలవులను ప్రకటించగా, ఇప్పుడు వాటిని 12 రోజులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు.

దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’వేదికగా ఆయన వెల్లడించారు. సెప్టెంబర్‌ 22 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి పేర్కొన్నారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సెప్టెంబరు 22 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి, విద్యాశాఖ ముందుగా జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల‌ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉన్నాయి. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అదనంగా రెండు రోజులు సెలవులు లభించనున్నాయి. అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Maharashtra: ఎట్టకేలకు చిక్కిన మ్యాన్‌ ఈటర్‌

ఉద్యోగిని ఆత్మ హత్య.. కుటుంబానికి రూ. 90 కోట్ల పరిహారం

ఫోన్ వద్దు.. పోదాం గ్రౌండ్‌కి అంటున్న కలెక్టర్! ఎక్కడంటే

మెరుగుపడుతున్న ఓజోన్ పొర పరిస్థితి

‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ ప్రీమియర్ షో.. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ