బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అదుపులో ఏపీ మత్స్యకారులు
బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ ఎనిమిది మంది ఏపీ మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన వీరు చేపల వేటకై సముద్రంలోకి వెళ్లి దారి తప్పి బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా, ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల విడుదల కోసం సంప్రదింపులు జరుపుతోంది.
బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అదుపులో ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు ఉన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ఈ మత్స్యకారులను బంగ్లాదేశ్ నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన ఈ ఎనిమిది మంది మత్స్యకారులు మెరుగైన జీవనోపాధి కోసం విశాఖపట్నానికి వలస వెళ్లారు. అక్కడ సముద్రంలో చేపల వేట కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన విశాఖ చేపల రేవు నుంచి మర బోటులో సముద్రంలోకి వెళ్లారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30ల్లోకి రాకముందే సీనియర్లు అయ్యారుగా
OG నా సినిమాకు కాపీ.. ఆ దర్శకుడి సంచలన ఆరోపణ
ఎన్టీఆర్ – నీల్ సినిమా ఆగిపోయిందా ??