ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఇక అధిక బిల్లుల బాధే ఉండదు

Updated on: Nov 08, 2025 | 9:05 AM

ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ నెల నుంచి కరెంట్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విధించిన అధిక ఛార్జీల భారాన్ని తొలగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చౌడువాడ, కింతలి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాలను మంత్రి రవికుమార్‌ ప్రారంభించారు.

గత ప్రభుత్వం ఎఫ్‌పీపీ ఛార్జీల రూపంలో యూనిట్‌కు 40 పైసలు అధికంగా వసూలు చేసేదని, అది పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. ప్రస్తుతం ఆ ఛార్జీని 13 పైసలకు తగ్గిస్తున్నామని, దీనివల్ల వినియోగదారులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామన్న మంత్రి.. 11 జిల్లాల్లో రూ. 250 కోట్ల వ్యయంతో 69 కొత్త విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు, రాష్ట్రంలోని 20 వేల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఉచితంగా సౌరవిద్యుత్తు యూనిట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల విద్యుదాఘాతానికి గురై మరణించిన వారి కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరో ఆర్టీసీ బస్సు దగ్ధం.. ప్రయాణికులంతా సేఫ్

ఆ పాత్రికేయుడి విగ్రహానికి ముద్దులతో మహిళల నివాళి.. ఎందుకో తెలుసా ??

గగనయాన్‌ ప్రయోగం వాయిదా.. అందుకేనా ??

నిన్న శబరిమల.. నేడు కంచి.. దేవుళ్ళకే శఠగోపం పెడుతున్న కేటుగాళ్లు