AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోయి లేకుంటే ఎలా.. అడ్డంగా మోసపోయింది..!

సోయి లేకుంటే ఎలా.. అడ్డంగా మోసపోయింది..!

Phani CH
|

Updated on: Nov 21, 2026 | 2:18 PM

Share

ప్రముఖ టాలీవుడ్ నటి అనితా చౌదరి సైబర్ మోసానికి గురయ్యారు. అమెరికాలో ఉంటున్న కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ విమాన టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా నకిలీ ట్రావెల్ సంస్థ వలలో చిక్కుకున్నారు. ఓటీపీ చెప్పడంతో ఆమె బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.4.14 లక్షలు కాజేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రముఖ టాలీవుడ్ నటి అనితా చౌదరి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. అమెరికా వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ విమాన టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా.. సైబర్ మోసానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆమె బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.4.14 లక్షలు కాజేశారు. అనితా చౌదరి తాను మోసపోయినట్లు గుర్తించి.. వెంటనే బ్యాంకు కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. అసలు ఆమె ఎలా మోసపోయారంటే..! అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లేందుకు అనితా చౌదరి ఈ నెల 12న విమాన టికెట్ల బుకింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికారు. లో ఫ్లై ట్రావెల్స్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అనే సంస్థ ఆమెకు కనిపించింది. వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌కు కాల్ చేయగా.. రాజేశ్‌ అనే వ్యక్తి లిఫ్ట్ చేసి మాట్లాడాడు. వాషింగ్టన్‌ డీసీకి వెళ్లి.. తిరిగి వచ్చేందుకు బిజినెస్‌ క్లాస్‌ టికెట్ల ధర రూ.4,14,180 అవుతుందని చెప్పాడు. అనితా చౌదరిని మాటల్లో పెట్టి.. టికెట్స్ బుకింగ్‌ చేయడానికి డెబిట్‌ కార్డు డీటెయిల్స్ కావాలని అడిగాడు. ఓ ఫారం పంపించి.. అందులో డెబిట్‌ కార్డు డీటెయిల్స్ ఫిల్ చేయమన్నాడు. నిందితుడు అనితా చౌదరితో ఫోన్‌లో మాట్లాడుతూ.. మొబైల్‌కు వచ్చిన వన్ టైమ్ పాస్‌వర్డ్‌ చెప్పాలని కోరాడు. టికెట్ల బుకింగ్‌ ప్రక్రియలో భాగంగానే ఓటీపీలు అడుగుతున్నారని భావించిన అనితా.. ఓటీపీ చెప్పారు. ఆపై క్షణాల్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.4.14 లక్షలు బదిలీ చేసుకున్నారు. డబ్బు డెబిట్‌ అయినట్లు అనితకు మెసేజ్ వచ్చినా.. టికెట్ల బుకింగ్‌ పూర్తయినట్లు ఎలాంటి ధ్రువీకరణ రాకపోవడంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించారు. అనితా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకునేటప్పుడు వెబ్‌సైట్‌ నిజమైనదో కాదో చూసుకోవడం అత్యంత కీలకమని పోలీసులు అంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీలు ఇవ్వకూడదని చూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: నా జీవితంపై డాక్యుమెంటరీ ఎందుకు తీయకూడదు.. విమర్శకులకు నయన్ కౌంటర్!

Ramya Krishnan: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ ఉంది.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్ – విలన్‌ మధ్య కొట్లాట.. ఎవ్వరూ తగ్గట్లేగా..

రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు.. బాలీవుడ్ నటుడి దయనీయ స్థితి

Monalisa Bhosle: చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుందా.. మోనాలిసా ఇప్పుడేం చేస్తోంది

Follow Us