సంక్రాంతికి ఏపీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగకు ముందే ఉత్సాహపూరితమైన వాతావరణం నెలకొంది. ఆవకాయ అమరావతి ఉత్సవాలు, విశాఖ లైట్‌హౌస్ ఫెస్టివల్, రాయలసీమలో ఫ్లెమింగో ఫెస్టివల్ వంటి మూడు ప్రధాన కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంది. ఈ ఉత్సవాలు కళలు, సంస్కృతి, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలకు వినోదాన్ని పంచుతున్నాయి.
సంక్రాంతి పండుగకు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. మూడు ప్రధాన ఈవెంట్లు, ఆరు కార్యక్రమాలతో రాష్ట్రం మొత్తం ఉత్సాహంగా ఉంది. అమరావతి, విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాల్లో వరుస వినోద కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్‌లో ఆవకాయ అమరావతి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం వంటి పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్
