ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్‌

Updated on: Oct 11, 2025 | 4:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఉద్దేశించిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ.. శుక్రవారం మరోసారి నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి, నెట్‌వర్క్ ఆస్పత్రుల మధ్య బకాయిల చెల్లింపు విషయంలో నెలకొన్న వివాదం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు, నెట్‌వర్క్ ఆస్పత్రులు నేటి నుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్ కింద అందించే ఎమర్జెన్సీ సహా అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 2,700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి. తమకు ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే తప్ప ట్రీట్‌మెంట్ విషయంలో ముందుకు పోలేమని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్‌ సెక్రటరీ శరత్‌బాబు తెలిపారు. ఇప్పటికే సమ్మె విరమించాలని కూటమి ప్రభుత్వం,హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ విజ్ఞప్తి చేసినా.. చర్చలు జరిపినప్పటికి ప్రభుత్వం చేసిన వాగ్ధానం ప్రకారం బకాయిలు విడుదల చేయకపోవడంతో వైద్యం పడకేసింది. వైద్య సేవల నిలిపివేతపై మరింత సమాచారం మా ప్రతినిథి శివకుమార్ వివరిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AI వీడియోలపై నిషేధం !! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

బంగారం కొనేటప్పుడు ఈ 5 విషయాలు తెలుసుకోండి

గోల్డ్ లోన్ తీసుకున్నారా ?? ఇది మీ కోసమే

కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కేబినెట్ ఆమోదం

చెరువు గట్టుపై భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు