Andhra Pradesh: జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారికోసం ప్రత్యేక పథకం..
Andhra Pradesh, Septemeber 30: సర్కారీ ఆస్పత్రుల్లో పేదోడికి పెద్ద వైద్యం అందిస్తోంది జగన్ సర్కర్. హార్ట్ అటాక్ వచ్చినవాళ్లను ప్రాణాపాయం నుంచి బయటపడేసే 40 వేల రూపాయల ఖరీదైన ఇంజెక్షన్‌ను ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టెమీ ప్రోగ్రామ్ కింద ఉచితంగా అందుబాటులో ఉంచుతోంది. ఇది పేదోడికి పెద్ద సాయం. ఆపదలో ఉన్నవాడికి అతి పెద్ద వైద్యం.
Andhra Pradesh, Septemeber 30: సర్కారీ ఆస్పత్రుల్లో పేదోడికి పెద్ద వైద్యం అందిస్తోంది జగన్ సర్కర్. హార్ట్ అటాక్ వచ్చినవాళ్లను ప్రాణాపాయం నుంచి బయటపడేసే 40 వేల రూపాయల ఖరీదైన ఇంజెక్షన్‌ను ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టెమీ ప్రోగ్రామ్ కింద ఉచితంగా అందుబాటులో ఉంచుతోంది. ఇది పేదోడికి పెద్ద సాయం. ఆపదలో ఉన్నవాడికి అతి పెద్ద వైద్యం. హార్ట్ అటాక్ వస్తే చనిపోకుండా కాపాడే సంజీవనిని జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. గుండెపోటు వచ్చిన వెంటనే 40 వేల రూపాయల ఇంజెక్షన్ చేస్తే రోగి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ఉండని ఈ సూదిమందును ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెచ్చింది జగన్ సర్కార్. హార్ట్ అటాక్ వచ్చినవాళ్లకు..ఏపీలోని అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఈ ఇంజెక్షన్‌ను ఉచితంగా ఇస్తారు. స్టెమీ ప్రోగ్రామ్ కింద దీన్ని పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు.
సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అధునీకరించిన పిల్లల వార్డ్, పిల్లల ప్లే ఏరియా, గుండెపోటు అత్యవసర చికిత్స స్టెమీ ప్రోగ్రామ్‌ను జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు. హార్ట్ అటాక్ వస్తే ప్రాణాపాయం నుంచి బయటపడేసే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లను ఉచితంగా అందిస్తామన్నారు అంబటి. ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రతిష్టాత్మకమైన, విప్లవాత్మకమైన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభం కానుందన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి అందరి ఆరోగ్యాన్ని చెక్ చేస్తారని, మందులు ఉచితంగా ఇస్తారన్నారు.