AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Assembly Session Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో

AP Assembly Session Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో

Shaik Madar Saheb
|

Updated on: Sep 18, 2025 | 12:32 PM

Share

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. యూరియా సమస్యపై చర్చించాలని మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ క్రమంలో.. వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. యూరియా సమస్యపై చర్చించాలని మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఉ.10 గంటలకు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే.. అసెంబ్లీ సమావేశాలను 5 రోజుల పాటు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పనిదినాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆరు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ఈ క్రమంలో.. వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. సభాపతి స్థానానికి గౌరవమివ్వాల్సిన అవసరం ఉందని..సమస్యలపై చర్చించేందుకు అందరికీ అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా ఉండడం సరికాదంటూ పేర్కొన్నారు.

Published on: Sep 18, 2025 09:12 AM