Andhra: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Updated on: Sep 16, 2025 | 8:32 PM

ఏపీ ప్రభుత్వం 2025 దసరా పండుగకు సంబంధించి సెలవుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు తొమ్మిది రోజుల సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. తెలంగాణలో 13 రోజుల దసరా సెలవులు ఉండనున్నాయి.

2025 దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు, మొత్తం తొమ్మిది రోజుల పాటు విద్యార్థులకు దసరా సెలవులు అమలులో ఉంటాయి. అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ఈ సెలవులు అందించడం ఆనవాయితీ. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణలో కూడా దసరా సెలవులు ప్రకటించబడ్డాయి, అక్కడ 13 రోజుల సెలవులు ఉండనున్నాయి.

Published on: Sep 16, 2025 08:27 PM