Amrit Bharat Train: ‘అమృత్ భారత్’ ఎలా ఉంటుందంటే.? తొలి వీడియోను షేర్ చేసిన రైల్వే మంత్రి..
డిసెంబర్ 30న ప్రారంభించిన ‘అమృత్ భారత్’ రైలు తొలి వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. ‘అమృత్ కాల్ కి అమృత్ భారత్ ట్రైన్’ అని ఎక్స్‌లో తెలిపారు. వందే భారత్ తరహాలో వేగంగా ప్రయాణించే ఈ రైలులో రాత్రి వేళ పడుకునే సౌకర్యంతో పాటు అనేక ప్రత్యేకతల గురించి ఆయన వివరించారు. లోకో పైలట్ క్యాబిన్, రైలులోని సీట్లు, టాయిలెట్లు, ఇతర సౌకర్యాల గురించి తెలిపారు. అధునాతన సాంకేతికతతో రూపొందిన రైలులో ప్రయాణించడం ద్వారా సుమారు రెండు గంటల సమయం ఆదా అవుతుందని చెప్పారు.
డిసెంబర్ 30న ప్రారంభించనున్న ‘అమృత్ భారత్’ రైలు తొలి వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. ‘అమృత్ కాల్ కి అమృత్ భారత్ ట్రైన్’ అని ఎక్స్‌లో తెలిపారు. వందే భారత్ తరహాలో వేగంగా ప్రయాణించే ఈ రైలులో రాత్రి వేళ పడుకునే సౌకర్యంతో పాటు అనేక ప్రత్యేకతల గురించి ఆయన వివరించారు. లోకో పైలట్ క్యాబిన్, రైలులోని సీట్లు, టాయిలెట్లు, ఇతర సౌకర్యాల గురించి తెలిపారు. అధునాతన సాంకేతికతతో రూపొందిన రైలులో ప్రయాణించడం ద్వారా సుమారు రెండు గంటల సమయం ఆదా అవుతుందని చెప్పారు. అమృత్ భారత్ ట్రైన్.. పుష్-పుల్ టెక్నాలజీ కలిగి ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్, వికలాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, తక్కువ నీరు వినియోగించే సాంకేతికత, విశాలమైన తలుపులు, ప్రత్యేక ర్యాంప్ వంటివి ఉంటాయని చెప్పారు. వందే భారత్ మాదిరిగానే, అమృత్ భారత్ రైలు కొత్త టెక్నాలజీ కలిగి ఉందన్నారు. ప్రారంభ ప్రయాణం అయోధ్య నుంచి దర్భంగా వరకు ఉంటుందని తెలిపారు. హైస్పీడ్ వందే భారత్ ట్రైన్ స్లీపర్ వెర్షన్‌గా పేర్కొనే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 30న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ రైలులో సాధారణ తరగతి నుంచి సెకండ్ క్లాస్ ఏసీ వరకు బోగీలుంటాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.