స‌పోటా పండ్లను రోజూ తింటే ఎన్ని అద్భుత‌మైన లాభాలో తెలుసా? వీడియో

Updated on: Aug 03, 2025 | 3:11 PM

ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అందులో భాగంగానే మనకు ఏడాది పొడవునా లభించే పండ్లతో పాటు సీజన్లను బట్టి లభించే పండ్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని రకాల పండ్లను చాలామంది తినేందుకు అంతగా ఇష్టపడరు. అలాంటి పండ్లలో సపోటా పండ్లు కూడా ఒకటి. ఇవి తియ్యగా ఉన్నప్పటికీ చాలామంది వీటిని తినరు. కానీ సపోటా పండ్లను రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

సపోటా పండ్లలో మన శరీరానికి కావలసిన అనేక పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల సపోటా పండ్లను తింటే సుమారు 145 కేలరీల శక్తి లభిస్తుంది. సపోటా పండ్లలో విటమిన్ ఏ, సి, ఈ లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే పోషకాహార లోపం తగ్గుతుంది. శరీరానికి పోషణం లభిస్తుంది. ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. పైగా ఈ పండ్లలో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండ్లను సందేహం లేకుండా తినవచ్చు. కానీ తగిన మోతాదులోనే తినాల్సి ఉంటుంది. సపోటా పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఈ పండ్లను తింటే బలబద్ధకం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల కడుపు ఉబ్బరం తో పాటు గ్యాస్, యాసిడిటీ వంటి జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు. సపోటా పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే శరీరానికి శక్తి లభిస్తుంది. ఈ చక్కెరలు నిరంతరాయంగా రిలీజ్ అవుతూనే ఉంటాయి. దీంతో శక్తి లభిస్తూనే ఉంటుంది.