నీవి ఆ ఫోటోలు పంపిస్తావా..?’ నా కుమార్తెనే వేధించారు.. హీరో ఆవేదన వీడియో
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూతురు ఆన్‌లైన్ గేమ్‌లో వేధింపులకు గురయ్యారు. సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025లో పాల్గొన్న ఆయన, ఈ ఘటనను వివరించారు. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ, పిల్లలను సైబర్ నేరాల నుండి రక్షించడానికి ప్రతి స్కూల్‌లో సైబర్ విద్యను తప్పనిసరి చేయాలని కోరారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన 13 ఏళ్ల కుమార్తె ఆన్‌లైన్ వీడియో గేమ్ ఆడుతుండగా జరిగిన వేధింపుల ఘటనను వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025 కార్యక్రమంలో ముంబైలో పాల్గొన్న ఆయన, తన కూతురి అనుభవాన్ని ముఖ్యమంత్రికి, ఇతర ప్రముఖులకు వివరించారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి తన కూతురిని “నీవి ఆ ఫోటోలు పంపగలవా?” అని అడిగాడని ఆయన తెలిపారు. ఈ ఘటన పిల్లలు ఆన్‌లైన్‌లో ఎదుర్కొంటున్న ప్రమాదాలకు అద్దం పడుతోందని అక్షయ్ కుమార్ అన్నారు. చిన్న పిల్లలపై పెరుగుతున్న సైబర్ నేరాల ప్రమాదాన్ని హైలైట్ చేస్తూ, సైబర్ నేరం ఇప్పుడు సాధారణ వీధి నేరాల కంటే పెద్దదిగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను ఈ ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి బలమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి స్కూల్‌లో సైబర్ విద్యను తప్పనిసరి చేయాలని, ముఖ్యంగా 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు వారానికోసారి సైబర్ పీరియడ్ నిర్వహించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
