Ajwain: ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..

|

Oct 28, 2024 | 11:43 AM

యూరిక్ యాసిడ్ ఎక్కువైతే గౌట్ సమస్యలు వస్తాయి. ఇందులో కాళ్లు, చేతులలో ఎముకలు బయటకు పొడుచుకు వచ్చినట్టు ఉంటాయి. దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో వాము గింజలు సమర్థవంతంగా పనిచేస్తాయని అంటున్నారు. అసలు వాము గింజలలో ఉండే పోషకాలేంటి? వాటిని ఎలా ఉపయోగిస్తే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుందో చూద్దాం.

కారంగా, ఘాటుగా ఉండే వాము విత్తనాలను వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తారు. అయితే వీటిని ఆయుర్వేదంలో కొన్ని రకాల సమస్యలకు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. వాము గింజలలో ప్రోటీన్, ఫైబర్, కొవ్వు, ఫాస్పరస్, నికోటినిక్ యాసిడ్ తో పాటు యూరిక్ యాసిడ్ ను నియంత్రించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వాములో ఉండే లుటియోలిన్, 3-ఎన్-బ్యూటిల్పలైడ్స్ , బీటా-సెల్లినిన్ అని పిలువబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలోనూ, అలాగే గౌట్ సమస్యకు కారణం అయ్యే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.

యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతీ రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు వాము నీటిని తాగితే ఉపశమనం ఉంటుందంటారు. ఇందుకోసం ఒక స్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీటిని వడగట్టి తాగాలి. కావాలంటే ఇందులో కాస్త అల్లం కూడా జోడించుకోవచ్చు.

వాము నీటిని తాగడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య మాత్రమే కాకుండా మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఎసిడిటీ, మలబద్దకం సమస్యతో బాధపడేవారికి వాము నీరు ఔషధంగా పనిచేస్తుంది. వాములో యాంటీస్పాస్మోడిక్, కార్మినేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మలబద్దకం, ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి వాము నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ కు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. వాములో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. మేం అందించే ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. పాటించే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on