Air pollution: ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
భారత్‌లోని పది ప్రధాన నగరాల్లో స్వల్పకాలిక వాయు కాలుష్యానికి ఏటా సుమారు 33 వేల మంది బలవుతున్నట్టు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. సస్టెయినబుల్ ఫ్యూచర్స్ కొలాబొరేటివ్, అశోకా యూనివర్సిటీ, సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్, స్వీడెన్‌కు చెందిన కెరలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి.
భారత్‌లోని పది ప్రధాన నగరాల్లో స్వల్పకాలిక వాయు కాలుష్యానికి ఏటా సుమారు 33 వేల మంది బలవుతున్నట్టు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. సస్టెయినబుల్ ఫ్యూచర్స్ కొలాబొరేటివ్, అశోకా యూనివర్సిటీ, సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్, స్వీడెన్‌కు చెందిన కెరలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. 2008-2019 మధ్య కాలంలో PM 2.5 సూక్ష్మ ధూళి కణాల ప్రభావం కారణంగా సంభవించిన మరణాలపై ఈ అధ్యయనం నిర్వహించారు.
ఈ అధ్యయనం ప్రకారం, ఢిల్లీలో అత్యధికంగా ఏటా 12 వేల మంది వాయు కాలుష్యానికి బలయ్యారు. బెంగళూరులో ఏటా 2100 మంది, చెన్నైలో 2900 మంది, కోల్‌కతాలో 4700 మంది, ముంబైలో 5,100 మంది ఏటా వాయు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. సిమ్లాలో వాయుకాలుష్య సంబంధిత మరణాల సంఖ్య దేశంలోనే అత్యల్పంగా ఏటా 59గా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ధూళికణాల్లో ప్రతి 10 మైక్రోగ్రాముల పెరుగుదలకు మరణాల శాతం 1.17 శాతం పెరుగుతోందని తేలింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.