AP News: వామ్మో.. నెయ్యి ఇలా తయారు చేస్తున్నారా..? మీరు జాగ్రత్త అండోయ్
అనపర్తి మండలంలోని పొలమూరులో కల్తీ నెయ్యి వ్యాపారం గుట్టురట్టు చేశారు. పొలమూరుకు చెందిన టి.రాజారెడ్డి స్వీట్లు తయారీకి రెండు వేర్వేరు పేర్లతో లెసెన్సు పొంది నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ తయారీ కేంద్రంలో సుమారు రూ.7 లక్షల విలువ చేసే ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో కల్తీ నెయ్యి గుట్టురట్టు చేశారు విజిలెన్స్ అధికారులు. సుమారు 7 లక్షలు విలువైన ముడి సరుకును అధికారులు సీజ్ చేశారు. గత కొన్నేళ్లుగా కల్తీ నెయ్యి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో ఈ దందా వెలుగులోకి వచ్చింది. కల్తీ నెయ్యి తయారీకి గాను డాల్డా, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌తోపాటు నెయ్యి ఫ్లేవర్, రంగు, రుచి కోసం ఆరోగ్యానికి హాని కలిగించే వివిధ రకాల రసాయనాలు వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కల్తీ నెయ్యిలో కొంత భాగం ఒడిశా తరలించి మరికొంత చీకటి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తే.. కఠిన సెక్షన్లు పెట్టి జైల్లో వేయిస్తామని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Feb 15, 2024 02:00 PM