Watch Video: రాజమండ్రిలో ఈయనకు సీటు ఇస్తే ఓటు వేయమంటున్న జనసేన కార్యకర్తలు..
TDP, Janasena party

Watch Video: రాజమండ్రిలో ఈయనకు సీటు ఇస్తే ఓటు వేయమంటున్న జనసేన కార్యకర్తలు..

|

Feb 25, 2024 | 6:15 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జనసేన కార్యాలయంలో కందుల దుర్గేష్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. మీటింగ్ అనంతరం బయటికి వచ్చిన జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కందులు దుర్గేష్ కు రాజమండ్రి సీటు ఇవ్వకపోతే తాము పార్టీకి పనిచేసి ప్రయోజనం ఏముందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జనసేన కార్యాలయంలో కందుల దుర్గేష్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. మీటింగ్ అనంతరం బయటికి వచ్చిన జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కందులు దుర్గేష్ కు రాజమండ్రి సీటు ఇవ్వకపోతే తాము పార్టీకి పనిచేసి ప్రయోజనం ఏముందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా బుచ్చయ్య చౌదరికి సీటు ఇస్తే మాలో ఒక్కరు కూడా ఓటు వేయమని తెగేసి చెప్పారు. కొన్నేళ్ల పాటు జనసేన పార్టీ సిద్ధాంతాలకు దుర్గేష్‎ కట్టుబడి ఉన్నారన్నారు. నిడదవోలుకు వెళ్లి పోటీ చేయమని చెప్పినట్లు దుర్గేష్ చెప్పారు.

తమ నాయకునికి అన్ని విధాలా సహకరించామని ఉమ్మడి జిల్లా బాధ్యతలు ఇచ్చిన జనసేన పార్టీ.. దుర్గేష్‎కు రాజమండ్రి రూరల్ సీటు ఇవ్వకపోవడం పార్టీకే చెడ్డ పేరు అన్నారు. పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారని గుర్తుచేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని నమ్ముకుని అన్నీ పోగొట్టుకున్నామని తెలిపారు. ఈసారి కార్యకర్తలుగా తాము రాజకీయ పార్టీలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Feb 25, 2024 06:14 PM