అన్ని లక్షల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌గానే వారి ఆధార్ కార్డులు

Updated on: Jul 23, 2025 | 4:03 PM

దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోట్లమంది మరణించారు. అయినా సరే ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ చేసిందా? ఎందుకంటే సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెల్లడైందని ఓ జాతీయమీడియా కథనం పేర్కొంది.

ఈ డిఫరెన్స్.. ఆధార్ డేటా విశ్వసనీయత, అప్‌గ్రేడ్‌పై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తిందని చెప్పింది. సంయుక్త రాష్ట్రాల జనాభా నిధి (UNFPA) గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2025 నాటికి భారత జనాభా 146.39 కోట్లకు చేరుకుంది. అయితే ఆధార్ కార్డుదారుల సంఖ్య 142.39 కోట్లుగా ఉంది. సిటిజన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) డేటా ప్రకారం.. 2007 నుంచి 2019 వరకు సంవత్సరానికి సగటున 83.5 లక్షల మరణాలు నమోదయ్యాయి. ఈ లెక్కన గత 14 సంవత్సరాల్లో 11.69 కోట్లకు పైగా మృతి చెంది ఉండొచ్చు. అయినప్పటికీ యూఐడీఏఐ కేవలం 1.15 కోట్ల ఆధార్ నెంబర్లను మాత్రమే మరణాల ఆధారంగా డీయాక్టివేట్ చేసింది. గత ఐదు సంవత్సరాల్లో.. సంవత్సరాల వారీగా ఎన్ని ఆధార్ నెంబర్లను మరణాల ఆధారంగా డీయాక్టివేట్ చేశారు అని ఆర్టీఐ ద్వారా అడిగినప్పుడు “అటువంటి సమాచారం తమ వద్ద లేదని, ఈ ప్రక్రియ మరణ ధ్రువీకరణపత్రం, కుటుంబసభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగా జరుగుతుందని UIDAI సమాధానం ఇచ్చింది. డిసెంబర్ 31, 2024 నాటికి మరణాల ఆధారంగా మొత్తం 1.15 కోట్ల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ చేశామని UIDAI తెలిపింది. ఈ అసమానత ఆధార్ వ్యవస్థలో మరణాల రిజిస్ట్రేషన్, డీయాక్టివేషన్ ప్రక్రియలో లోపాలను ఎత్తిచూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యాక్టివ్‌గా ఉన్న ఆధార్‌లను దుర్వినియోగం చేసే అవకాశాలుంటాయని, అలాగే ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఈ ఐడీ లింక్ ఉన్న ఇతర సర్వీసులపైనా ప్రభావం ఉంటుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నక్క తోక తొక్కడం అంటే ఇదే కాబోలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ

స్కూల్లో మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న చిన్నారి.. అంతలోనే..!

ఇక.. డబ్బు లేకుండానే గ్యాస్ సిలిండర్లు

వర్షాకాలంలో ఈ పండ్లు తిన్నారో.. రోగాలకు రెడ్‌ కార్పెట్‌ పరిచినట్లే..

నాడు నైట్ వాచ్‌మెన్‌గా జీతం రూ.165… నేడు.. కోట్లు సంపాదిస్తున్న నటుడు