Alluri Sitharama Raju District: పాస్టర్‌ ఘాతుకం..గిరిజన బాలికకు వాతలు

Edited By:

Updated on: Jun 30, 2026 | 9:36 PM

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దొంగతనం అనుమానంతో ఎనిమిదేళ్ల గిరిజన బాలికను ఇంట్లో నిర్బంధించి వేడి అట్లకాడతో కాల్చిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.10 వేల నగదు పోయిందన్న అనుమానంతో బాలికను హింసించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం ధారకొండ గ్రామంలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. దొంగతనం చేసిందనే నెపంతో ఎనిమిదేళ్ల గిరిజన బాలికపై అట్లకాడతో కాల్చి వాతలు పెట్టిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ధారకొండకు చెందిన పాస్టర్ జయరాజ్, ఆయన భార్య కలిసి ఒక ఎనిమిదేళ్ల మైనర్ బాలికను తమ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు. అయితే, ఇటీవల వారి ఇంట్లో రూ. 10,000 పోయాయని, ఆ డబ్బును బాలికే తీసిందని పాస్టర్ దంపతులు అనుమానించారు. ఈ క్రమంలో బాలికను ఇంట్లోనే నిర్బంధించి వేధించారు. జూన్ 26న జరిగిన ఈ ఘటనలో, వారి ఇంటి పక్కన నివసించే రూపవతి అనే మహిళ తీవ్ర ఘాతుకానికి ఒడిగట్టింది. బాలిక చేతులపై వేడి అట్లకాడతో వాతలు పెట్టింది. మహిళ బాలికను అంతగా హింసిస్తున్నా, పక్కనే ఉన్న పాస్టర్ దంపతులు ఆమెను కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు సరే కదా… సదరు మహిళను మరింత ప్రోత్సహించారని బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంతో ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధిత బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు… నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే ఐటీ ఉద్యోగులను మించిన ఐడియా!

అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!

క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!

“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!

ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు

Loading...
Unable to load recommendations.
Follow Us