Telangana: ఓ ఇంటి నుంచి అదేపనిగా వింత చప్పుళ్లు.. ఏంటని చూడగా.. వామ్మో.!
ఈ పాము నాగుపాము అని, సుమారు 7 అడుగుల పొడవు ఉందని, సాధారణంగా పాములు ఎవరికి హాని చేయవని, వాటి జోలికి వస్తేనే తిరగబడతాయని అన్నాడు. జనావాసాల్లో ఎప్పుడు వచ్చినప్పుడు తనకు ఫోన్ చేసినట్లయితే తాను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేస్తానని అన్నాడు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఒక ఇంటిలో పాము చొరబడటంతో కలకలం రేగింది. చివరికి స్నేక్ క్యాచర్ పామును పట్టుకోవడంతో ఆ ఇంటి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగ్లాదేశ్ కాలనీలో గల ఒక ఇంటిలో నాగుపాము చొరబడింది. పాము ఇంట్లోకి ప్రవేశించడానికి గమనించిన ఇంటి వాళ్ళు అందరూ బయటకు వచ్చి పట్టణంలోని పాములు పట్టే స్నేక్ క్యాచర్ యాసీన్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. పాము చొరబడిన ఇంటి వద్దకు చేరుకున్న యాసిన్ ఇంట్లోకి వెళ్లి చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. నాగుపాము సుమారు 7 అడుగుల పొడవు ఉంది. పట్టుకున్న నాగు పామును పట్టణ శివారులోని అటవీ ప్రాంతంలో వదిలేశాడు.
వైరల్ వీడియోలు
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

